AP Media – Pawankalyan: డ్యామేజ్ కంట్రోల్.. సీఎం పోస్ట్ పై పవన్ అందుకే స్పందించాడా?
అందుకే సీఎం పోస్టుపై పవన్ స్పందించాల్సి వచ్చింది. తన మాటలను వక్రీకరించారని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల వేళ ఆచీతూచీ స్పందించాలని జన సైనికులు అధినేతను విన్నవించే దాకా పరిస్థితి వచ్చింది.

AP Media – Pawankalyan: పవన్ కళ్యాణ్ మీడియా బాధితుడు.. మీరు చదివింది నిజమే. జనసేన ఆవిర్భావం నుంచి మీడియా కొడుతున్న దెబ్బలు అన్నీఇన్నీ కావు. చాలా సందర్భాల్లో జనసేనను, పవన్ ను డ్యామేజ్ చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో ఎల్లో మీడియా, నీలిమీడియా రెండుకు రెండూ ఒక్కటే. ఇక నీలిమీడియాది అయితే ఒకటే పని. పవన్ చర్యలను ప్రతికూలతగా చూపించడమే దాని పని. ఇక ఎల్లో మీడియా అయితే చంద్రబాబు అవసరాల రీత్యా ప్రాధాన్యతలను మార్చేస్తూ ఉంటుంది. చంద్రబాబుకు అవసరమైనప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుంది. లేకుంటే మాత్రం పాతాళానికి తోసేస్తుంది. ఏపీలో రాజకీయ ముసుగుతో మీడియా ఆడుతున్న వికృత క్రీడలో పవన్, జనసేన ఎప్పుడూ బాధితవర్గమే.
అకాల వర్షాలతో పంటకు నష్టం జరిగిన రైతులను పవన్ పరామర్శించారు. ఈ సందర్భగా పవన్ వ్యాఖ్యలులో అసలు పాయింట్లను మరిచి కొసరు పాయింట్లతో డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘2019 ఎన్నికలలో మనకి 40 సీట్లు వచ్చి ఉంటే పవర్ షేరింగ్ గురించి బలంగా అడిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని అన్న మాటలను పలువలు చిలువలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఈ ఆరాటం అంటూ పాత పల్లవిని సుదీర్ఘం సాగదీసి చెప్పడం ప్రారంభించారు. మేము చెబుతోంది అదే కదా.. చూడండి వారిద్దరూ కలిసిపోయారంటూ అధికార పక్షం దాడిచేయడం ప్రారంభించింది. మీ ఓట్లను అమ్మేస్తున్నారని చూడండి అంటూ పేటీఎం బ్యాచ్ పేట్రేగి పోయింది. అయితే ఈ విషయంలో పవన్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేసింది నీలిమీడియా.
ఎల్లో మీడియా తక్కువ తిందా అంటే అదీ లేదు. అసలు పవన్ కు సీఎం పోస్టు అంటేనే ఇష్టం లేదన్న రీతిలో రాసుకొచ్చింది. మొన్నటివరకూ పవన్ 20 సీట్లకు ఒప్పుకున్నారంటూ చెప్పుకొచ్చిన ఈ సెక్షన్ మీడియా..రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల వారికే పవర్ అని పవన్ వ్యాఖ్యానించారంటూ కొత్త కథలు, కథనాలు అల్లింది. ఎప్పుడూ పత్రికల్లో ఏ మూలన పవన్ వార్తలను ప్రచురించే ఈ మీడియా సీఎం పోస్టు నుంచి వెనక్కి తగ్గినట్టు అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడేసరికి దానికి పెద్ద తలకాయలు తగిలించి కథనాలు వండి వార్చింది. ఇక పసుపు సోషల్ మీడియా అయితే అదే పనిగా ప్రచారం చేసుకుంటూ పోతోంది.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. పొరుగున ఉన్న కర్నాటకలో కుమారస్వామి కీరోల్ ప్లే పోషిస్తారని.. అదే మాదిరిగా ఏపీలో కూడాపవన్ రిపీట్ చేస్తారని భావిస్తున్న వేళ.. అధినేత నుంచి విభిన్న ప్రకటన ఏమిటని హార్టయ్యాయి. అందుకే సీఎం పోస్టుపై పవన్ స్పందించాల్సి వచ్చింది. తన మాటలను వక్రీకరించారని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల వేళ ఆచీతూచీ స్పందించాలని జన సైనికులు అధినేతను విన్నవించే దాకా పరిస్థితి వచ్చింది.
