Pawan Kalyan : ఏపీలో కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ 5 కోట్ల విరాళాన్ని జనసేనకు ఇచ్చాడు. ఇంకా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు లక్ష చొప్పున సాయాన్ని రేపు అందించబోతున్నాడు. ఇవీ పవన్ కళ్యాణ్ సొంత డబ్బులే. సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును అంతా కూడా ప్రజల కోసం.. వారి కష్టాలు తీర్చేందుకు పవన్ కళ్యాణ్ వాడుతున్నాడు. విలాసాలకు పోకుండా.. కేవలం వ్యవసాయ క్షేత్రంలో సాదాసీదాగా బతుకుతూ ఇప్పటి జల్సా రాజకీయ నేతలకు ఒక గుణపాఠం నేర్పుతున్నారు. సొంత లగ్జరీ కంటే ప్రజల కష్టాలే ముఖ్యం అంటూ సినిమాల్లో సంపాదించినదంతా విరాళం అందజేస్తున్న పవన్ కళ్యాణ్ గొప్ప మనసుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
-కౌలు రైతులకు 5 కోట్లు ఇచ్చిన పవన్
కేవలం చనిపోయిన రైతులకు పరిహారం ఇచ్చి కౌలు రైతుల మరణాన్ని అపహాస్యం చేసిన జగన్ సర్కార్ కు బుద్దివచ్చేలా.. కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాడు. ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని తనే సొంతంగా చేశాడు. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన 5 కోట్ల మొత్తాన్ని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వినియోగించాడు. ఏపీ వ్యాప్తంగా కౌలు రైతుల ఇంటికి స్వయంగా వెళ్లి లక్ష రూపాయల చొప్పున సాయం అందించాడు. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వాలు పెడచెవిన పెట్టినా.. నేతలు పట్టించుకోకపోయినా.. నేనున్నానంటూ కౌలు రైతుల కష్టాలు తీర్చి వారి పాలిటి ఒక దేవుడిలా పవన్ కళ్యాణ్ అవతరించాడు.
-ఇప్పుడు ఇప్పటం ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున సాయం
జనసేన ఆవిర్భావ సభ జరగకుండా జగన్ సర్కార్ ఎన్నో అడ్డుపుల్లలు వేసింది. పవన్ కళ్యాణ్ కు సభాస్థలి దొరకకుండా.. అనుమతి ఇవ్వకుండా విసిగించింది. కానీ ఇప్పటం గ్రామ రైతులు పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకున్నారు. ఆయన కోసం తమ వ్యవసాయ భూములను ఇచ్చారు. అందులోనే జనసేన ఆవిర్భావ సభను నిర్వహించాడు పవన్. వారి ధైర్య సాహసాలకు మెచ్చిన పవన్ రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తంతో గ్రామస్థులు ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకున్నారు. అయితే తాము ఎంత నిర్బంధించినా కూడా జనసేన కోసం ఇప్పటం రైతులు భూములు ఇవ్వడాన్ని జగన్ సర్కార్ సహించలేకపోయింది.. అందుకే రోడ్డు విస్తరణ పేరిట వారి ఇళ్లను కూలగొట్టించింది. దీనిపై పవన్ కళ్యాణ్ కదిలివచ్చి బాధితులకు అండగా నిలిచాడు. పోరాడాడు. తమ పార్టీ కోసం ఇంత చేసిన బాధితులకు రేపు కూలగొట్టిన వారికి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు.
-జనసైనికుల కోసం అలుపెరగని పవన్ కళ్యాణ్
జనసేన కోసం అహర్నిషలు శ్రమిస్తున్న జనసైనికుల కోసం బృహుత్తర పథకాన్ని సైతం పవన్ ప్రారంభించారు. వివిధ కారణాలతో చనిపోయినా, ప్రమాదాల్లో క్షతగాత్రులగా మారినా.. వారి కోసం ప్రత్యేక బీమా పథకాన్ని తన సొంత నిధులతో పవన్ ఏర్పాటుచేశారు. ఇప్పటివరకూ వందలాది మందికి కోట్లాది రూపాయలను బీమా పరిహారం కింద అందించిన గొప్ప నాయకుడు పవన్,. మొన్నటికి మొన్న విశాఖలో అన్ని ఇబ్బందుల నడుమ వివిధ కారణాలతో చనిపోయిన జన సైనికుల కుటుంబాలకు బీమా పరిహారాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ ఆవిర్భవించిన ఈ సుదీర్ఘ కాలంలో తన వందల కోట్ల సంపాదనను పార్టీ కోసం.. ప్రజల కోసం ఖర్చుచేశారు. బహుశా ఇటువంటి నాయకుడు దేశంలో ఎవరూ ఉండరనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.
జనసేన ఇప్పటివరకూ అధికారం చేపట్టలేదు. సంప్రదాయ పార్టీల మాదిరిగా విరాళాలు సేకరించలేదు. ఖర్చు తప్ప ఆదాయం ఎరుగని ఒకే పార్టీ జనసేన. ఆ పార్టీకి అండా, దండ అంతా పవనే. పార్టీ నిర్వహణ నుంచి బాధితులకు సాయం వరకూ అంతా పవన్ కష్టార్జితం నుంచి వస్తున్నదే. విపక్షాలు రకరకాల విష ప్రచారం చేసినా.. రాజకీయ ప్రత్యర్థులు ప్యాకేజీ నాయకుడంటూ ప్రచారం చేస్తున్నా వెరవడం లేదు. పవన్ అంత నిజాయితీగా, నిబ్బరంగా ఉన్నారంటే అదంతా ప్రజల కోసమే.. అయితే ఒకటి మాత్రం చెప్పగలం. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కు డబ్బు సంపాదనే ప్రాతిపదిక అయితే.. ఏడాదికి మూడు నాలుుగు సినిమాలు చేసుకొని వందల కోట్లు సంపాదించవచ్చు. హాయిగా తన స్టార్ డమ్ ను ఆస్వాదించవచ్చు. కానీ పవన్ మాత్రం ప్రజల బాటే పట్టారు. ప్రజల కోసం పరితపిస్తున్నారు. వారి కోసం వ్యయప్రయాసలకోర్చుతున్నారు. చివరకు రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ గా మిగులుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. పవన్ త్యాగనిరతికి, స్వార్థం లేని రాజకీయాలను చూసి టర్న్ అవుతున్నారు. తాను సంపాదిస్తున్న కోట్లాది రూపాయలను ప్రజలకే నేరుగా సాయం చేస్తుండడాన్ని విద్యాధికులు, మేధావులు సైతం సెల్యూట్ చేస్తున్నారు.