Pawan Kalyan: ఒకే ఏడాది లో 4 సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే!
వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ పాత చిత్రాలు కూడా రీ రిలీజ్ అవ్వబోతున్నాయి. కాసేపటి క్రితమే వచ్చే నెల 30 వ తారీఖున పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ గా నిల్చిన ‘తొలిప్రేమ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ మాత క్రియేషన్స్ అధికారిక ప్రకటన చేసింది.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఒక వారం ఒక సినిమా షూటింగ్ లో ఉంటె, మరో వారం ఇంకో సినిమా షూటింగ్ లో ఉంటాడు. ఇంత బిజీ గా ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన ‘బ్రో’ సినిమాని పూర్తి చేసేసాడు. ఈ ఏడాది జులై 28 వ తారీఖున ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఆయన #OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం #OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ , వచ్చే నెల నుండి ‘హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ ఏడాది బ్రో చిత్రం తో పాటుగా #OG చిత్రం కూడా డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్నట్టు సమాచారం.
వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ పాత చిత్రాలు కూడా రీ రిలీజ్ అవ్వబోతున్నాయి. కాసేపటి క్రితమే వచ్చే నెల 30 వ తారీఖున పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ గా నిల్చిన ‘తొలిప్రేమ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీ మాత క్రియేషన్స్ అధికారిక ప్రకటన చేసింది. ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం రీ రిలీజ్ అయితే రికార్డ్స్ మొత్తం స్మాష్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు గా కొనసాగుతున్న చిత్రం పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ నే, ఇప్పుడు ఈ రికార్డు ని తొలిప్రేమ బద్దలు కొడుతుందో లేదో చూడాలి, మరోపక్క సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇలా ఈఏడాది మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.