Pawan Kalyan : ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్?
Pawan Kalyan : ఈ దసరా నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర చేపట్టడానికి రెడీ అయ్యారు. సీరియస్ గా ఏపీ రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తను ఒప్పుకున్న సినిమాలను కూడా త్వరగా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 60శాతం షూటింగ్ కంప్లీట్అయిన ‘హరిహర వీరమల్లు’ను దసరాలోపు పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల విడుదలైన గ్లాన్స్ ఉర్రూతలూగించేలా ఉంది. ఇప్పుడు యాత్ర లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని […]

Pawan Kalyan : ఈ దసరా నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర చేపట్టడానికి రెడీ అయ్యారు. సీరియస్ గా ఏపీ రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తను ఒప్పుకున్న సినిమాలను కూడా త్వరగా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు.
ఇప్పటికే 60శాతం షూటింగ్ కంప్లీట్అయిన ‘హరిహర వీరమల్లు’ను దసరాలోపు పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల విడుదలైన గ్లాన్స్ ఉర్రూతలూగించేలా ఉంది. ఇప్పుడు యాత్ర లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ ఆత్రుతగా ఉన్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా యాత్రను కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలిసింది.
ఇక తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా కోసం కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు తెలిసింది. కేవలం 20 రోజులు కాల్షీట్స్ ఇవ్వడానికి పవన్ ఓకే చెప్పాడట.. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 20 రోజుల కాల్షీట్లకే పవన్ కు ఏకంగా రూ.50 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట..
ఈ క్రమంలోనే రాజకీయ యాత్రకు ఖర్చులు, జనసైనికుల భోజనాలు, యాత్రలో సౌకర్యాలకు ఈ డబ్బులు ఉపయోగపడుతాయని.. పవన్ దసరాలోపే ఈ సినిమాకు కూడా కాల్షీట్లు ఇచ్చి పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట.. ఈమేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
