Rajamouli Pawan Kalyan : కోట్లాది మంది అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కోరుకునే కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ – రాజమౌళి చిత్రం..వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడితే చూడాలని ట్రేడ్ వర్గాలు సైతం కోరుకుంటాయి..పంజా సినిమా షూటింగ్ సమయం లో వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు..పవన్ కళ్యాణ్ కూడా నేను సిద్ధం కథ సిద్ధం చెయ్యండి అని రాజమౌళి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా.
కానీ రాజమౌళి కి ఉన్న కమిట్మెంట్స్ మరియు పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ బిజీ గా మారడం తో రాజమౌళి తో ఇక సినిమా అనేది అసాధ్యం అని అందరూ అనుకున్నారు..కానీ ఎక్కడో ఒక మూల వీళ్లిద్దరి కాంబినేషన్ మూవీ వస్తుంది అనే నమ్మకం అభిమానుల్లో ఉండేది..ఆ నమ్మకం త్వరలోనే నిజం కాబోతుందని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
2024 తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ఉండబోతుందని సమాచారం..ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు..వచ్చే ఏడాది జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కనుంది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండే అవకాశం ఉంది..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాతో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’ , సుజిత్ తో ఒక మూవీ మరియు సురేందర్ రెడ్డి తో ఒక మూవీ ఉంది.
ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత రాజమౌళి తో సినిమా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఇదే కనుక నిజమైతే మూవీ లవర్స్ కి ఇక పండగే..పవన్ కళ్యాణ్ కూడా ఈమధ్య సినిమాలు చాలా ఆసక్తితో చేస్తున్నాడు..హరి హర వీరమల్లు సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు..కొత్త రకమైన మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు..రాజమౌళి మూవీ హీరోలు ఇంత డెడికేషన్ తో ఉండాలి..పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజమౌళి హీరోలాగానే ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడు..కచ్చితంగా వీళ్ళ కాంబినేషన్ లో మూవీ ఉంటుంది అని ఫిలిం నగర్ లో గట్టిగా టాక్ వినిపిస్తుంది.