‘కోహినూర్’ కోసం పవర్ స్టార్ ఫైట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోహినూర్ వజ్రం కోసం జరిగే పోరాట సన్నివేశాలు సినిమాకే హెలైట్ గా నిలిచే స్టంట్ మాస్టర్లు […]

  • Written By: Neelambaram
  • Published On:
‘కోహినూర్’ కోసం పవర్ స్టార్ ఫైట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఏఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోహినూర్ వజ్రం కోసం జరిగే పోరాట సన్నివేశాలు సినిమాకే హెలైట్ గా నిలిచే స్టంట్ మాస్టర్లు సన్నివేశాలను రూపొందించినట్లు సమాచారం.

మొగల్ సామ్రాజ్యం కాలంనాటి చరిత్రను ఈ మూవీలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ బందీపోటుగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ మూవీలో రంగమ్మత్త(అనసూయ) ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. 30నిమిషాల పాటు ఆమె పాత్ర ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’, ‘శాతకర్ణి’ వంటి పిరియాడికల్ మూవీలు తెరకెక్కాయి. ఈ మూవీలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.

పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పిరియాడికల్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబిన్ హుడ్ తరహాలో పవన్ పాత్రను ఉండనుందట. ఈ మూవీ కోసం భారీ కోటలకు సంబంధించిన సెట్లను కూడా వేశారు. కోటలపై యుద్ధాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనిలో భాగంగా కోహినూర్ వజ్రం కోసం జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పవన్ సరసన ప్రజ్ఞ జైస్వాల్, పూజా హెగ్డే ఎంపికైనట్లు సమాచారం. వీరిపేర్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు