Kota Srinivasa Rao Vs PK Fans : కోటా శ్రీనివాస రావు ని బూతులు తిడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..ముసలి వయస్సులో కూడా బుద్ధి రాలేదు అంటూ కామెంట్స్
టా శ్రీనివాస రావు అలా మాట్లాడాడు అంటే ఆయనకీ పవన్ కళ్యాణ్ అంటే ఎంత మంటో అర్థం అవుతుందని, గతం లో నాగబాబు ఆయనని పచ్చి బూతులు తిట్టడం లో తప్పే లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

Kota Srinivasa Rao Vs PK Fans : నటుడిగా అతను ఒక లెజెండ్,ఇండస్ట్రీ లో నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన క్యారక్టర్ ఆర్టిస్ట్స్ ఎస్ వీ రంగారావు మరియు కైకాల సత్యనారాయణ లాంటి లెజెండ్స్ జాబితాలో నిలిచే రేంజ్ నటుడు ఆయన. కానీ ఈమధ్య ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారి, తనకి ఉన్న ప్రాముఖ్యత మరియు విలువని పోగొట్టుకుంటున్నాడు. అతను మరెవరో కాదు, కోటా శ్రీనివాస రావు.
వయస్సు పెరిగితే చాదస్తం పెరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు కోటా శ్రీనివాస రావు విషయం లో అదే జరుగుతుంది. ఈమధ్య కాలం లో ఆయన మన స్టార్ హీరోల పై చేస్తున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేస్తుంది. ఈమధ్య జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోటా శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్ గతం లో తనకి నిర్మాతలు ఒక్క రోజుకి రెండు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇస్తారు అని మాట్లాడిన మాటలకు కోటా శ్రీనివాస రావు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా పరోక్ష కౌంటర్లు విసిరాడు.
ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో ఎన్టీఆర్ , నాగేశ్వరరావు లాంటి మహానుభావులు వాళ్ళు తీసుకుంటున్న పారితోషికాల గురించి ఎన్నడూ బహిరంగంగా చెప్పుకోలేదు. కానీ రీసెంట్ గా కొంతమంది స్టార్ హీరోలు రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నాము అని మైక్ పెట్టుకొని మరీ చెప్తున్నారు అది కరెక్ట్ కాదు’ అంటూ కోటశ్రీనివాస రావు నిన్న చేసిన కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియా లో చాలా ఘాటు రెస్పాన్స్ వచ్చింది.
వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ పై ప్యాకేజి తీసుకున్నాడు అంటూ ఆరోపిస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ నాకు ప్యాకేజి తీసుకునే ఖర్మ ఏమిటి, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకి రోజుకి రెండు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను, ఎంతో సుఖంగా సినిమాలు చేసుకుంటే నాకు అంత రెమ్యూనరేషన్ వస్తుంది, మీ దగ్గర తిట్టించుకుంటూ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో వైసీపీ కి కౌంటర్ ఇచ్చాడు. ఇది తెలిసి కూడా కోటా శ్రీనివాస రావు అలా మాట్లాడాడు అంటే ఆయనకీ పవన్ కళ్యాణ్ అంటే ఎంత మంటో అర్థం అవుతుందని, గతం లో నాగబాబు ఆయనని పచ్చి బూతులు తిట్టడం లో తప్పే లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
