పవన్ డబుల్ ధమాకా.. రికార్డు రిపీట్ చేస్తాడా..?
వేసవికి విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ తో రీ-ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్. ఇదే ఏడాది మరో సినిమాతో అలరించనున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం.అయితే 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట. ఆసక్తికరమైన విషయమేమిటంటే పవన్ తన కెరీర్ లో ఇప్పటివరకు నాలుగు సార్లు డబుల్ ధమాకా ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’, 2011లో ‘తీన్ మార్’, ‘పంజా’, […]

వేసవికి విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ తో రీ-ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్. ఇదే ఏడాది మరో సినిమాతో అలరించనున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం.అయితే 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.
ఆసక్తికరమైన విషయమేమిటంటే పవన్ తన కెరీర్ లో ఇప్పటివరకు నాలుగు సార్లు డబుల్ ధమాకా ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’, 2011లో ‘తీన్ మార్’, ‘పంజా’, 2012లో ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఇలా నాలుగుసార్లు డబుల్ ధమాకా ఇచ్చాడు పవన్. 8 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సంవత్సరంలో రెండేసి సినిమాలతో రాబోతున్నాడు. 1998లో రెండు బ్లాక్ బస్టర్స్ చూసిన పవన్.. 22 ఏళ్ళ అనంతరం అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.