Pawan Kalyan : వాలంటీర్ల జీతం బూమ్ బూమ్ కి ఎక్కువ, ఆంధ్రా గోల్డు కి తక్కువ – పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
జగన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని వక్రీకరిస్తున్నారు అంటూ నిరసన తెలియచేసారు. ఇలా ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో బయట పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇక ‘వారాహి విజయ యాత్ర’ నేడు తాడేపల్లి గూడెం కి చేరుకుంది. ఈ మీటింగ్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.

Pawan Kalyan : మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ ఏలూరు ‘వారాహి విజయ యాత్ర’ సభలో వాలంటీర్ వ్యవస్థపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కూడా చాలా దీటైన సమాధానం చెప్పారు.
జగన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని వక్రీకరిస్తున్నారు అంటూ నిరసన తెలియచేసారు. ఇలా ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో బయట పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇక ‘వారాహి విజయ యాత్ర’ నేడు తాడేపల్లి గూడెం కి చేరుకుంది. ఈ మీటింగ్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ముఖ్యంగా వాలంటీర్స్ గురించి మాట్లాడుతూ ‘ నాకు వాలంటీర్స్ పొట్ట కొట్టాలని నిజంగా మనస్ఫూర్తిగా లేదు. నేను మాట్లాడుతున్నది వ్యవస్థ గురించి. ఒక వ్యవస్థ లో ఇన్ని ఆర్గనైజషన్స్ ఉన్నప్పుడు ,దానికి సమాంతరం గా వాలంటీర్ వ్యవస్థ ని తీసుకొని రావాల్సిన అవసరం ఏమిటి. కేవలం 5 వేల రూపాయిలు మీకు ఇస్తూ మీ జీవితాలను నాశనం చేస్తున్నాడు జగన్, మీ ఒక్క రోజు జీతం 120 రూపాయిలు . నేడు మీ జీతం బూమ్ బూమ్ కి ఎక్కువ, ఆంధ్రా గోల్డు కి తక్కువ, ఒక్కసారి ఆలోచించండి’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హైలైట్ గా మారాయి. దీనికి రేపు వైసీపీ పార్టీ నాయకులు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి. నేడు తాడేపల్లి గూడెం లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అధికార పక్షం కి మరోసారి తలనొప్పి తెచ్చి పెట్టేలా చేసింది.