Pawan Kalyan: డైరెక్టర్ పై జోకులు వేసినందుకు స్టార్ కమెడియన్ చెంప పగలగొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆ కమెడియన్ ఏమయ్యాడో తెలుసా!
మిగిలిన ఆర్టిస్టులతో కూడా మూడ్ బాగున్నప్పుడు సరదాగానే ఉండేవాడు కానీ , లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వడు. అయితే గతం లో ఆయన హీరో గా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రం ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఆర్టిస్ట్స్ కి కూడా అవకాశం ఇచ్చాడు, వారిలో షకలక శంకర్ కూడా ఒకడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేటప్పుడు ఆర్టిస్టులు చాలా జాగ్రత్తగా వళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి, లేదంటే ఇత్తడి అయిపోతాది అని ఇండస్ట్రీ లో అందరూ అనుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మందితో మాత్రమే ఆయన స్నేహం చేస్తుంటాడు. అలా ఆయన ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , కమెడియన్ అలీ తో మాత్రమే స్నేహం గా ఉండేవాడు.
మిగిలిన ఆర్టిస్టులతో కూడా మూడ్ బాగున్నప్పుడు సరదాగానే ఉండేవాడు కానీ , లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వడు. అయితే గతం లో ఆయన హీరో గా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించిన చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రం ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఆర్టిస్ట్స్ కి కూడా అవకాశం ఇచ్చాడు, వారిలో షకలక శంకర్ కూడా ఒకడు.
షకలక శంకర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ ఆయన జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ కూడా చేసాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లో నటించే అవకాశం రావడం తో అతని ఆనందానికి అప్పట్లో హద్దులే లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ గ్యాప్ లో తీరిక దొరికినప్పుడు ఈ జబర్దస్త్ టీం తో సరదాగా స్కిట్స్ వంటివి లొకేషన్ లో చేయించి ఎంజాయ్ చేసేవాడు.
అలా జబర్దస్త్ టీం తో పాటుగా షకలక శంకర్ తో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి బాండింగ్ ఏర్పడింది. అలా పవన్ కళ్యాణ్ ఇచ్చిన చనువు కారణంగా షకలక శంకర్ కాస్త సెట్స్ లో బిల్డప్స్ కొట్టేవాడట. ఒకరోజు ఆయన ఆ చిత్ర దర్శకుడు బాబీ మీద సెటైర్లు వేసినట్టు పవన్ కళ్యాణ్ కి తెలిసిందట. అంతే ఆవేశం తో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ షకలక శంకర్ ని పిలిచి చెంప పగలగొట్టాడట. ఇక అప్పటి నుండి సెట్స్ లో అతి చెయ్యకుండా షూటింగ్ లో పాల్గొని వెళ్లేవాడట షకలక శంకర్.