HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేద్దాం, ఆంధ్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం
అడ్వటైజ్ మెంట్లు చేస్తే కోట్లు ఇస్తామన్నా చేయనన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్ని కోట్లు వదులుకున్న హీరో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.
HBD Pawan Kalyan : ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదినం. 51 సంవత్సరాలు పూర్తి చేసుకొని 52వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా కీలకం. స్వతంత్రంగా రాజకీయ పార్టీని పెట్టి.. దాని కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ.. చేయాల్సిందంతా చేస్తూ వస్తున్నాడు.
ఈరోజు ఆ సందర్భంగా జనసేన పార్టీ 5 సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒకటి భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు. రెల్లి కాలనీల్లో జన్మదినవేడుకలు.., రక్తదాన శిభిరాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కు ఆర్థిక సహాయం, దివ్యాంగుల కోసం ఆర్థిక సహాయం లాంటి 5 సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్న కార్యక్రమాలు కావడం విశేషం.
ఈ సందర్భంగా పవన్ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకోవాలి. కెరీర్ లో బాగా పీక్ గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్లు బహు అరుదు. ఉదాహరణకు.. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లు సినిమాల్లో పీక్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ఈ టైంలో నిర్మాతలు పవన్ ఇంటి ముందు క్యూ కడుతున్న ఈ వేళలో పవన్ ఇవి వద్దని రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్ట్ టైంగానే సినిమాలు చేయడం అద్భుతం.. అనిర్వచనీయం. అడ్వటైజ్ మెంట్లు చేస్తే కోట్లు ఇస్తామన్నా చేయనన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్ని కోట్లు వదులుకున్న హీరో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.
పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేద్దాం, ఆంధ్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం’ పవన్ బర్త్ డే సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
