పవన్-జగన్ మధ్య చిగురిస్తున్న స్నేహబంధం?
“రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు” అనేది రాజకీయ నానుడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ నానుడి హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికలలో జగన్, పవన్ కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. విషయం ఏమిటంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గడిచిన రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ప్రధాని మోడీ తో 100 నిమిషాలు, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో 40 నిమిషాలు భేటీ […]

“రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు” అనేది రాజకీయ నానుడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ నానుడి హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికలలో జగన్, పవన్ కలిసి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
విషయం ఏమిటంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గడిచిన రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ప్రధాని మోడీ తో 100 నిమిషాలు, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో 40 నిమిషాలు భేటీ అయ్యారు. పైకి ఎన్ని చెబుతున్నా.. లోలోపల రాజకీయ కోణంలో ఏదో జరుగుతుందనేది కొట్టిపారేయలేని విషయం.
అమిత్ షా తో భేటీ ఎలా ఉన్నా.. మోడీ 100 నిమిషాల అపాంట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, వైసీపీ కలవనున్నాయా… అనే టాపిక్ తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే జరిగితే.. పవన్ పరిస్థితి ఏమిటి? అనేది ఒక విషయం. అటు పవన్, ఇటు జగన్ ని కలుపుకొని బీజేపీ వెళ్లనుకుంటుందా.. అనేది తెలియాలి. అదే జరిగితే బీజేపీ-వైసీపీ కూటమితో పవన్ ఇమడగలడా .. అనేది మరో విషయం.
బీజేపీ కి కేంద్రంలో పవన్ కంటే జగన్ అవసరమే ఎక్కువ. అలాగని పవన్ వదులుకునే స్థితిలో బీజేపీ లేదు కాబట్టి ముగ్గురం కలిసే ఉందాం అనొచ్చు కూడా.. అందుకు జగన్ ఒప్పుకుంటారు. ఇక పవన్ కూడా ఒప్పుకుంటే బీజేపీ-జనసేన-వైసీపీ కూటమి కలిసి 2024 ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లే.. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొంత కాలం ఎదురుచూడాలి.