Pawan Kalyan Hair Style: పవన్ కళ్యాణ్ : హెయిర్ స్టైల్ తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో

పవన్ కళ్యాణ్ నడిచి వచ్చిన చాలు ఆయన అభిమానులు ఫిదా అయిపోతారు. గబ్బర్ సింగ్ లో ఎగ్జిబిషన్ లో జరిగే ఒక స్పీచ్ సీన్ తరువాత పవన్ కళ్యాణ్ కేవలం అలా నడుస్తూ ఎర్ర తవల్ చుట్టుకుంటూ వస్తారు

  • Written By: Vishnupriya
  • Published On:
Pawan Kalyan Hair Style: పవన్ కళ్యాణ్ : హెయిర్ స్టైల్ తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో

Pawan Kalyan Hair Style: పవన్ కళ్యాణ్…ఈ పేరు వినగానే తెలుగువారికి ఎక్కడలేని పవర్ వచ్చేస్తుంది. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు…కానీ ఈ హీరోకి వీరాభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ఇష్టపడితే ఆచా తుచిగా ఇష్టపడరు…విపరీతంగా ప్రేమిస్తారు ..గౌరవిస్తారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి.. ఆ తరువాత రజినీకాంత్ కి ఉండే వారంట ఇలాంటి వీరాభిమానులు. ఇప్పుడు మళ్లీ మనం పవన్ కళ్యాణ్ కి చూస్తున్నాము.

ఒక నటుడు తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేయడం మామూలే. కానీ పవన్ కళ్యాణ్ నడిచి వచ్చిన చాలు ఆయన అభిమానులు ఫిదా అయిపోతారు. గబ్బర్ సింగ్ లో ఎగ్జిబిషన్ లో జరిగే ఒక స్పీచ్ సీన్ తరువాత పవన్ కళ్యాణ్ కేవలం అలా నడుస్తూ ఎర్ర తవల్ చుట్టుకుంటూ వస్తారు.. ఆ సీనుకి పడిన అన్ని విజిల్స్ మనం వేరే హీరో సినిమాలో చూడాలి అంటే ఒక పెద్ద ఎలివేషన్ సీనే ఉండాలి. అంతెందుకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్వయంగా చెప్పాడు బాహుబలి 2 ఇంట్రవెల్ సీన్ పవన్ కళ్యాణ్ ని చూసి రాసింది అని. ఆయనకి అంత క్రేజ్ ఉంది.

ఇక ఆయన మెడ పైన చెయ్యి పెడితే ..పేపర్లు చినగాల్సిందే. ఇక ఈ చిన్న స్టైల్స్.. మేనెరిసంతోనే కాదు తన హెయిర్ స్టైల్ తో అమ్మాయిలను సైతం ఫిదా చేసేసారు మన పవన్. అప్పుడెప్పుడో తమ్ముడు సినిమా.. అందులో మొదటి పాట.. ‘మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే అర్థం వివరిస్తా’…పాట మొత్తం ఒక ఎత్తు.. ‘నలిగిన డ్రెస్సు కొంత’ అంటూ పవన్ కళ్యాణ్ బ్లాక్ సూట్ వేసుకొని సెల్యూట్ కొడుటు ఒక స్టెప్ వేస్తారు.. అక్కడ ఆయన జుట్టు ఎగరడం చూడాలి…అప్పట్లో అమ్మాయిలందరూ ఆ సీన్ కోసమే ఆ పాటను పదిసార్లకు పైగా చూసారు అంటే అది నమ్మక తప్పని నిజమే.

ఇక ఖుషి సినిమాలో.. పవన్ ఊగతా ఉంటే.. ఆయన జుట్టు కూడా ఉగతానే ఉంటుంది. ఇక జల్సా సినిమాలో.. ‘జెన్నిఫర్’ పాట మొదట్ లో ..స్టెప్స్ పైన నుంచి దిగుతూ వస్తూ ఉంటాడు…ఇక అప్పుడు ఆయన హెయిర్ స్టైల్ ఎగరడం చూస్తే.. పవన్ హెయిర్ స్టైల్ తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అని అర్థం అయిపోతుంది.

నిజంగానే ఆయన హెయిర్ స్టైల్ చూడడం కోసం అబ్బాయిలు.. ముఖ్యంగా అమ్మాయిలు ఆయన సినిమాకి వెళ్లేవారు అంటే అతిశయోక్తి లేదు. అంతెందుకు ఎంతో మంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ఉందే అబ్బాయిని చేసుకోవాలి అనుకున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి కేవలం హెయిర్ స్టైల్ విషయములో కూడా అంతటి ట్రెండ్ క్రియేట్ చేసారు పవన్. అలాంటి మన పవన్ కళ్యాణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు