Pawan Kalyan : ‘హరి హర వీరమల్లు’ టీం కి పవన్ మరో భారీ షాక్..ఇక ఇప్పట్లో లేనట్టే!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న #OG మరియు హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అందుకే ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది.

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, AM రత్నం ఈ చిత్రానికి ఖర్చు కి ఏమాత్రం వెనకాడకుండా బడ్జెట్ పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ని లవర్ బాయ్ రోల్స్ , మాస్ రోల్స్ మరియు యూత్ ఫుల్ సబ్జక్ట్స్ లోనే జనాలు ఎక్కువగా చూసారు.మొట్టమొదటి సారి ఆయన పీరియాడిక్ జానర్ లో ఒక సినిమా చేస్తుండడం తో అందరిలో ఆసక్తి కలిగింది. దానికి తోడు ఇప్పటి వరకు విడుదలైన రెండు గ్లిమ్స్ వీడియోస్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎంతో బాగుండడం కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి.
అయితే ఈ చిత్రం షూటింగ్ గత కొంత కాలం నుండి నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న #OG మరియు హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అందుకే ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే మే నెల రెండవ వారం నుండి ఈ చిత్రానికి షెడ్యూల్స్ కేటాయించినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ మే చివరి వారం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేదు.
ఇది మూవీ యూనిట్ ని కాస్త అసహనం కి లోనయ్యేలా చేస్తుంది. #OG మూవీ షూటింగ్ లోనే ఆయన తన కాలాన్ని గడిపేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ జూన్ మొదటి వారం నుండి డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇదే చివరి షెడ్యూల్ అట. ఈ చివరి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.