పవన్ ఢిల్లీ పర్యటన.. జగన్ తో స్నేహానికి బాటలు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడపబోతున్నారు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్, ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ని కలిసారు . ఫస్ట్ జగన్, తర్వాత పవన్, ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస నేతలు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. గతవారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలను సీఎం జగన్, మోడీతో చర్చినట్లు […]

  • Written By: Neelambaram
  • Published On:
పవన్ ఢిల్లీ పర్యటన..  జగన్ తో స్నేహానికి బాటలు?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడపబోతున్నారు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్, ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ని కలిసారు . ఫస్ట్ జగన్, తర్వాత పవన్, ఢిల్లీ పర్యటనకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస నేతలు ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గతవారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలను సీఎం జగన్, మోడీతో చర్చినట్లు సమాచారం. అలాగే అమిత్ షా తో మండలి రద్దు, రాజధాని మార్పు పై చర్చించారు. ఈ వారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎవరెవరిని కలవబోతున్నారు, ఏయే నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనేవి ఆసక్తిగా మారాయి.

ఇప్పటికే ఏపీ లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత జగన్, ఢిల్లీ వెళ్ళి వైసీపీ-బీజేపీ కూటమిని ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి జనసేన-బీజేపీ-వైసీపీ కూటమికి పచ్చ జెండా ఊపే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఏపీ లో జగన్, పవన్ కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీతో పొత్తు నిమిత్తమే.. పవన్ కళ్యాణ్ ని ఒప్పించడానికి పవన్ కి ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు