Pawan Kalyan – Annamalai : ప్రజాయాత్రలతో ప్రకంపనలు సృష్టిస్తున్న పవన్-అన్నామలై
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని కదిలిస్తున్న మోడీని ఆదర్శంగా తీసుకున్నారు. ఇద్దరూ నిజాయితీపరులు. జనం కోసం పరితపించేవారు. ఇద్దరూ అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చినవారే.

Pawan Kalyan – Annamalai : రెండు యాత్రలు.. రెండు సునామీలు.. పక్కపక్క రాష్ట్రాల్లోనే ఇవి జరుగుతున్నాయి. ఒకనాడు ఇదంతా ఒకే రాష్ట్రం. ఒకరిది వారాహి యాత్ర అయితే.. ఇంకొకరది ‘నా భూమి నా ప్రజాయాత్ర’. ఒకరు తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతున్న హీరో పవన్ కళ్యాణ్ అయితే.. రెండో వ్యక్తి పోలీస్ అధికారిగా సింగంగా పేరు తెచ్చుకున్న ‘అన్నామలై. వీరిద్దరూ రెండు రాష్ట్రాల్లో సునామీ సృష్టిస్తున్నారు.. వీరిద్దరూ బయటకొచ్చి ప్రజల్లోకి వెళుతున్న తీరు.. ప్రజలను ఆకట్టుకుంటున్న విధానం చూస్తే అర్థమవుతోంది.
రెండు దక్షిణాది రాష్ట్రాల్లో సామాజిక పెనుమార్పులు, రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆల్ మోస్ట్ ఇద్దరిదీ ఒకటే శైలీ. ఇద్దరూ జాతీయ భావాలు మెండుగా పుణికి పుచ్చుకున్న నేతలు. ఇద్దరూ కూడా ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కూడా మోడీని గాఢంగా అభిమానిస్తారు.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని కదిలిస్తున్న మోడీని ఆదర్శంగా తీసుకున్నారు. ఇద్దరూ నిజాయితీపరులు. జనం కోసం పరితపించేవారు. ఇద్దరూ అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చినవారే.
పవన్ వారాహి యాత్ర, అన్నామలై నా భూమి, నా ప్రజాయాత్రలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
