K A Paul: పాల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. .శాంతి దూతగా ఎంత మందికి కేఏ.పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన గురించి తెలియని వాళ్లు ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఆయన ఇచ్చే పొలిటికల్ స్పీచ్ లకు వ్యూస్ కోట్లలో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చానల్స్ అన్ని ఆయన్ని తమ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆర్థికంగా కూడా సంపన్నుడు. ఎనిమిదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కొంత హడావుడి చేసి కనుమరుగయ్యారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ.పాల్ నర్సాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు, భీమవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి ప్రయత్నించారు. లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,037 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ నామినేషన్ వేసేందుకు బయల్దేరగా, సమయానికి కేంద్రానికి చేరుకోలేదు. దీంతో నామినేషన్ వేయలేకపోయారు. తాజాగా మళ్లీ పొలిటికల్ తెరపై సందడి చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ కార్యకర్త పాల్ చెంప చెల్లుమనిపించారు. దీంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చారు. అయితే తెలగాణలో ఆయన సడన్ ఎంట్రీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జగన్ ముందస్తుకు వెళతారని ఉహాగానాలు ఉన్న నేపథ్యంలో కేఏ.పాల్ తెలంగాణ రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

K A Paul
ఆయన వెనుక ఆ పార్టీ ప్లాన్…
పాల్ అమెరికా నుంచి వచ్చి రావడంతోనే కేసీఆర్‌పై నిప్పుడు చెరగడం ప్రారంభించారు. బంగారు తెలంగాణ సాధ్యం నాతోనే అంటూ ప్రెస్ మీట్‌ల మీద ప్రెస్ మీట్‌లు పెట్టారు. అయితే తెలంగాణలో కేఏ పాల్ ఈ సడెన్ ఎంట్రీ వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది కాంగ్రెస్ కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాస్త పుంజుకుందనే చెప్పుకోవాలి. మరోక వైపు తాజాగా పీకే కేసీఆర్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో అధికార పార్టీకి కేవలం 25 నుంచి 30 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీటన్ని నేపథ్యంలో కేఏ.పాల్‌ను అధికార పార్టీ నేతలే పక్కా రాజకీయ వ్యూహాంతో తెలంగాణలోకి తీసుకొచ్చారని ప్రతిపక్ష నేతలు కొంత మంది అనుమానిస్తోన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే…
వచ్చే ఎన్నికల్లో పోరు త్రిముఖంగా ఉన్న నేపథ్యంలో కేఏ.పాల్‌ను మధ్యలో బరిలో ఉంచితే కొంత మేరకైన ప్రభుత్వ వ్యతిరేక ఓటును పక్కదారి పట్టించొచ్చని ఆలోచనలో అధికాపార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ కేఏ.పాల్‌ను తనకు వ్యతిరేకంగా తెలంగాణలో ప్రచారం చేయడానికి తీసుకొచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం కేఏపాల్ సభకు అనుమతి నిరాకరించడం, అతనిపై దాడి చేయించడం కూడా అధికారపార్టీ స్క్రిప్ట్‌లో భాగామనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి.
అమిత్ షాతో భేటీ..

K A Paul, Amit Shah
రెండు రోజుల క్రితం పాల్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్షణం తీరికలేకుండా గడిపే అమిత్ షా ఢిల్లీలోని ఆయన ఆఫీసులో గురువారం రాత్రి పాల్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. షాను కలవాలంటే ముఖ్యమంత్రులు సైతం సుదీర్ఘంగా ఎందురు చూడాలి.. వస్తామంటూ విన్నపాలు పంపే గవర్నర్లు, ముఖ్యనేతలు, వీవీఐపీలకు తక్కువేమీ ఉండదు.. దేశంలో అత్యంత శక్తిమంతైన నేతల్లో ప్రధాని మోదీ తర్వాత నంబర్ 2గా వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిపాలతోపాటు బీజేపీ వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుండటం తెలిసిందే. క్షణం తీరికలేకుండా గడిపే షా మరి కొద్ది గంటల్లోనే తెలంగాణలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానుండగా ప్రపంచ ప్రఖ్యాత క్రై స్తవ బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న కేఏ.పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో తర్వాత పాల్ ఢిల్లీలో, అదీ, అమిత్ షా వద్ద ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది తెలంగాణలో కొత్త పొత్తులపై చర్చకూ సంకేతాలిచ్చినట్లయింది.
Also Read: NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?
కేసీఆర్‌పై ఫిర్యాదూ వ్యూహమేనా?

KCR
తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి, తనపై జరిగిన దాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి షాతో భేటీ తర్వాత పాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ తనపై దాడి చేయించారని, దాని ఫలితం, పరిణామాలు త్వరలోనే చూడటానికి సిద్దంగా ఉడాలని పాల్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతి ఇక చెల్లదని, ఆటలు సాగబోవని అన్నారు. టీఆర్‌ఎస్ దాడి క్రమంలో తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేఏ.పాల్ కేంద్ర మంత్రిని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే ఇది కూడా కేసీఆర్ వ్యూహమే అయి ఉండొచ్చని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు అమిత్ షా వ్యూహనని పేర్కొంటున్నారు. అనూహ్య రీతిలో బీజేపీ–ప్రజాశాంతి పార్టీ పొత్తు అంశం తెరపైకొచ్చింది. ప్రజాశాంతితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదనుకున్నా, తెలంగాణ పర్యటనకు ముందు అమిత్ షా.. పాల్‌ను కలవడం వల్ల ప్రజల్లోకి, విపక్షాలకు ఎన్నిరకాల సంకేతాలు వెళతాయనే అంచనా బీజేపీకి కచ్చితంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ వ్యతిరేకులు లేదా బాధితులు అందరికీ అండగా ఉండాలనే వ్యూహం మేరకే కేఏ.పాల్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ దక్కిందా? లేక ఇంకేవైనా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు? అనే అంశాలపైనా విస్తృత చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను చీల్చడానికి పాల్‌ను బీజేపీ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోందన్న వాదన ఉంది. అయితే బీజేపీ బీజేపీ ఒక్క పాల్ మీదే ఆధారపడటం లేదు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ ఓటు బ్యాంక్ చీలిక చేస్తే.. తాము ఓట్లు పొందినట్లేనని భావిస్తున్నారు. అందుకే పాల్ చేసే సాయం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎలాగైనా పాల్ ఈ సారి కేసీఆర్‌ను చిరాకు పెట్టాలని డిసైడ్ అయినట్లుగా భావిస్తున్నారు.
Also Read: Pragathi Hot pics: హాట్ సమ్మర్‌లో ‘చిల్’ ప్రగతి: సోషల్ మీడియాలో నటి రచ్చ.. వైరల్ పిక్స్..!!