Pathan Movie Review: నటీనటులు: షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , దీపికా పడుకొనే , జాన్ అబ్రహం , డింపుల్ కపాడియా, అశుతోష్ రానా
బ్యానర్ : యాష్ రాజ్ ఫిలిమ్స్
డైరెక్టర్ : సిద్దార్థ్ ఆనంద్
మ్యూజిక్ డైరెక్టర్ : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
సినిమాటోగ్రఫీ : సత్చిట్ పౌలోస్

Pathan Movie Review
బాలీవుడ్ అంటే మన అందరికి గుర్తుకు వచ్చే పేరు షారుఖ్ ఖాన్..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చిన ఈయన బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అమితాబ్ బచ్చన్ తర్వాత నెంబర్ 1 హీరో గా అవతరించాడు..ముఖ్యంగా మన ఇండియన్ సినిమాలకు నేడు ఈ రేంజ్ ఓవర్సీస్ మార్కెట్ ఉందంటే దానికి కారణం షారుఖ్ ఖాన్ అనే చెప్పాలి..ఆయన చేసిన సినిమాలు అక్కడ సృష్టించిన ప్రభంజనాల గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది..అలాంటి షారుఖ్ ఖాన్ కి గత కొంతకాలం గా హిట్స్ లేవు..చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది..ఆయన హీరో గా నటించిన ఆఖరి చిత్రం ‘జీరో’ 2018 వ సంవత్సరం లో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఆ తర్వాత నాలుగేళ్లు విరామం తీసుకొని ఆయన నటించిన పఠాన్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది..మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
ఈ చిత్రం యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి వచ్చిన స్పై థ్రిల్లెర్స్ టైగర్ జిందా హాయ్ మరియు వార్ సినిమాలకు కొనసాగింపు గా వచ్చింది..ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ పఠాన్ (షారుఖ్ ఖాన్) ఇండియా లో నెమెసిస్ జిమ్ (జాన్ అబ్రహం) చేసే బాంబు బ్లాస్ట్స్ గురించి తెలుసుకొని అతనిని ఆపడానికి రంగం లోకి దిగుతాడు..పఠాన్ జిమ్ ని ఎలా ఎదురుకున్నాడు..చివరికి అతని ఆటలను ఎలా అరికట్టి ఈ దేశాన్ని కాపాడుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ :
కథ పరంగా చూసుకుంటే ఇది చాలా రొటీన్ అనే చెప్పాలి..డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ నుండి మనం కథలను ఆశించకూడదు..ఆయన నుండి యాక్షన్ నే కోరుకోవాలి..ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ కి ఒక ఫీస్ట్ అనే చెప్పాలి..అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పాటుగా డ్రామా ని కూడా ఈ చిత్రం లో బాగా వచ్చేలాగా చేసాడు సిద్దార్థ్ ఆనంద్..ఇక షారుఖ్ ఖాన్ ని యాక్షన్ మూవీస్ లో చూడాలని కోరుకున్న అభిమానులకు పండగే అని చెప్పొచ్చు..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతంగా ఉంది..ఇక ఇంటర్వెల్ సన్నివేశం తర్వాత సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాది..షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా కుదిరాయి.

Pathan Movie Review
ఇక జాన్ అబ్రహం కి షారుఖ్ ఖాన్ తో సరిసమానమైన పాత్ర ని ఇచ్చారు..ఆయన ఇంట్రడక్షన్ సన్నివేశం అదిరింది..తనదైన మార్కుతో పండించిన విలనిజం కి మంచి మార్కులే పడ్డాయి..ఇక దీపికా పడుకొనే కూడా తన పరిధిమేర బాగానే నటించింది..మొత్తం మీద యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా ఒక ఫీస్ట్ అనే చెప్పాలి..ఈ సినిమా తర్వాత వచ్చే యాక్షన్ చిత్రం స్పై యూనివర్స్ లోనే ఉంటుంది..ఇందులో షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ కూడా నటిస్తారు.
చివరి మాట : యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఒక పండుగ లాంటిది..ఎంతో కాలం నుండి షారుఖ్ ఖాన్ హిట్ కొడితే చూడాలనుకున్న ఆయన అభిమానులకు ఈ సినిమా తర్వాత వాళ్ళ కోరిక నెరవేరింది అనే అనుకోవచ్చు.
రేటింగ్ : 2.75/5