Pathan Collections: మన టాలీవుడ్ లో తమిళ డబ్బింగ్ సినిమాలు బాగా ఆడుతాయి కానీ.. బాలీవుడ్ సినిమాలు ఇక్కడ విరగబడి ఆడడం చాలా అరుదు.. అలాంటిది ఈమధ్య బాలీవుడ్ సినిమాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడేస్తున్నాయి.. గత ఏడాది బ్రహ్మాస్త్ర చిత్రం ఇక్కడ పెద్ద హిట్ అయ్యింది.. కానీ అది తెలుగు డబ్ వెర్షన్.. కానీ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన పఠాన్ మూవీ కి మాత్రం హిందీ వెర్షన్ కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్ ని దక్కించుకుంది.

Pathan Collections
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో అయితే ఈ సినిమాకి స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఈమధ్య కాలం లో ఈ స్థాయి వసూళ్లు ఒక హిందీ చిత్రానికి రావడం ఎప్పుడూ చూడలేదు..తెలంగాణ ప్రాంతం లో ఒకప్పుడు తెలుగు సినిమాలకంటే హిందీ సినిమాలు బాగా ఆడేవి..ఇప్పుడు కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అనుకుందాం.. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ కి దుమ్ము లేచిపోయ్యే ఓపెనింగ్ రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

Pathan Collections
అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 15 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చుంటాయని అంచనా వేస్తున్నారు.. అంటే ఇక్కడ ఉన్న మీడియం రేంజ్ హీరోల ఓపెనింగ్స్ కంటే ఎక్కువ అన్నమాట.. ఇక నేడు పబ్లిక్ హాలిడే అవ్వడం దాని తర్వాత వీకెండ్ ఉండడం తో ఓపెనింగ్స్ కనివినీ ఎరుగని రేంజ్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..రీసెంట్ టైమ్స్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమా బ్రహ్మాస్త్ర.. సుమారు 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.. కానీ పఠాన్ చిత్రం కేవలం వీకెండ్ లోనే అంత మొత్తాన్ని రాబట్టి సంచలనం సృష్టించబోతుంది.