Pathan Mass Review: ఆ “బేషరం” పాటతోనే పఠాన్ సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకులకు ఒక అంచనా ఏర్పడింది.. పదేళ్లుగా హిట్ లేని షారుక్ ఖాన్ ఎంతకు దిగజారాడో అర్థమైంది. బాలీవుడ్ లో నేనూ ఉన్నాను అని చెప్పుకోవడానికి జాన్ అబ్రహం ఎందుకు తాపత్రయపడుతున్నాడో రుజువు అయింది.. సిద్ధార్థ ఆనంద్ ఎందుకు నెత్తి మాసిన దర్శకుడు అయ్యాడో మరోసారి రూఢీ అయింది. దీపికా పదుకొనే బరిబాతల డ్యాన్సులు వేసినా జనానికి ఏవగింపు కలిగించింది.. మొత్తానికి సినిమా కూడా 100 వీరయ్యలు, 1000 వీర నరసింహారెడ్డిలు కలిస్తే ఎలా ఉంటుందో… అలా ఉన్నది. నో డౌట్.. బ్యాన్ పఠాన్ నెత్తి మాసిన స్లోగన్. ప్రతీ విషయంలో బ్యాన్ అని అరిస్తే ఉపయోగం ఉండదు.. ప్రతీ చిన్న దెబ్బకు యాంటీ బయాటిక్ వాడకూడదు. ఏదైనా సీరియస్ విషయం మీద బ్యాన్ అనే అస్త్రం ప్రయోగిస్తేనే ఫలితం ఉంటుంది. ఇందులో దీపిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. అసలు ఆమె పాత్రే ఒక చిల్లర. దానికి తగ్గట్టు ఆ బరిబాతల వ్యవహారం. ఎంత వెకిలిగా చేయాలో అంత వెకిలిగా చేసింది.. అయ్యా ఈ మహానటి వంద దేశాలకు పాకుతుందట. పొరపాటున ఎవరైనా ఐఎస్ఐ లేడీ ఏజెంట్లు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం ముమ్మాటికీ దీపికదే.

Pathan Mass Review
సినిమాలో ఆమె పాత్ర జయలక్ష్మి, జయమాలిని ని మించిపోయింది.. చివరకు ఆ సన్నిలియోన్ కూడా ఇలాంటి పాత్ర చేస్తుందో లేదో డౌటే. సగటు వ్యాంప్ ను మించిన లేనితనం ఆమెది. ఆమె ప్రదర్శించిన అసభ్య మూమెంట్స్, అశ్లీల ఊపులతోనే అసలు సమస్య అంతా… ఏదో బట్టలు అంటే ఎలర్జీ ఉన్నదానిలా దేహ ప్రదర్శన చేసింది. అంతేతప్ప మతాలకు రంగులు ఉంటాయా.. రంగులకు మతాలు ఉంటాయా?
బాస్ ఈజ్ బ్యాక్ అని స్లోగన్ ఒకటి. సో కాల్డ్ బ్యాచ్ కు పని పాట లేక సోషల్ మీడియాలో ఎత్తుకున్న పల్లవి అది.. అంటే దాన్నిబట్టి ఇన్నాళ్లు జనం దేకక ఖాళీగా ఉన్నాడనే కదా అర్థం. తెలుగులో కూడా ఈ సినిమాని మంత్రంగా జపించారు.. వాస్తవానికి చాలా సంవత్సరాలుగా షారుక్ కు హిట్ లేదు..జీరో సినిమాతో పూర్తిగా జీరో అయిపోయాడు.. ఇప్పుడు దాన్ని అధిగమించేందుకు సిక్స్ ప్యాక్ బాడీ, ఫుల్ యాక్షన్, మెషిన్ గన్లు, తుపాకులు, హెలికాప్టర్ ఫైట్లు, సినిమా అంతా యాక్షనే. దీపిక తో చిల్లర ఎపిసోడ్స్.. తాము చెప్పిన సెన్సార్ కట్స్ ఏమయ్యాయో ఒకసారి బోర్డు సభ్యులు చెక్ చేసుకుంటే బెటర్.
తెలుగు అగ్ర హీరో లాగే షారుక్ కు కూడా తను ఒక్కడే సరిపోలేదు ఈ సినిమాలో.. సల్మాన్ ఖాన్ ను కూడా తెచ్చుకున్నాడు. షారుఖే పైట్లు చేసి చేసి చావగొడుతున్నాడు రా బాబూ అంటే ఈ సల్లూ కూడా మెషిన్ గన్లు అందుకుంటాడు. ఈ మధ్య సౌత్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము రేపుతున్నాయి.. సూపర్ మేన్ కెరక్టర్ లతో అతికే అతి అనిపిస్తున్నాయి. సేమ్ ఇందులో కూడా అడుగుకో ఎలివేషన్.. అంగుళానికి ఓ ఫైట్.. వంద కేజీ ఎఫ్ లు, వెయ్యి వీరయ్య లు,మరో పది వేల వీర సింహా రెడ్డి లు కనిపిస్తారు. బాలయ్య ను యశ్ ను, చిరంజీవి ని ఆవాహన చేసుకున్నట్టున్నాడు షారుఖ్.

Pathan Mass Review
ఇక ఈ సినిమాకు కథ, కాకరకాయ వంటి విశ్లేషణ అవసరం లేదు..పక్కా మధు బాబు షాడో నవల. నిజానికి “రా” అనేది ఓ సీక్రెట్ వ్యవహారం.. ఆ వ్యవస్థ బయటకు పెద్దగా కనిపించదు.. తాను చేసే పనులన్నీ తెర వెనుక జరిగిపోతాయి. కానీ సినిమాటిక్ లిబర్టీ పేరుతో ” రా” ను నానా పెంట దర్శకులు. ఇక ఈ సినిమాలో అయితే ఒంటి చేత్తో మిషన్ గన్, గ్రనెడ్ లాంచర్, మినీ పోర్టబుల్ రాకెట్ లాంచర్…అక్కడి దాకా ఎందుకు ఏకంగా డర్టీ బాంబులు వదిలే “రా” ఏజెంట్లు మన హీరోలు. ఒక రా ఏజెంట్ కొలువు పోతుంది.. కానీ అతడి నరనరానా దేశభక్తి ఉంటుంది. మరో రా ఏజెంట్ కొలువు కూడా పోతుంది. కానీ అతడు విలన్..ఇక ఇందులో పాక్ జనరల్ రక్త బీజ్ అనే జీవాయుధ ప్రయోగం ఇండియాపై తలపెడతాడు.. దాన్ని భగ్నం చేయడమే మిగతా కథ. జో వో సీ ఆర్ అని తనే సొంతంగా ఒక వ్యవస్థను తయారు చేసుకుంటాడు. ఏకంగా సిల్వేస్టర్ స్టాలోన్ అయిపోతాడు.. అన్నట్టు ఈ సినిమాలో సిద్ధార్థ ఆనంద్ తన పాత సినిమా వార్ వాసనలు ఉన్నాయి.
ఇక ఈ దర్శకుడే మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. తన రెమ్యూనరేషన్ 150 కోట్లు, ప్రభాస్ రెమ్యూనరేషన్ 150 కోట్లు.. అవి పైసలా? పెంకాసులా? అభూత సాహసాలు, అశ్లీల దృశ్యాలతో జనం పర్సులను కత్తిరించి,వాళ్ళను మాయామోహంలో ముంచేయడమే కదా! అన్నట్టు సినిమా చివరిలో ఇద్దరు ఖాన్ లు తమ “30 ఇయర్స్ ఇండస్ట్రీ” గురించి గురించి చెప్తారు. మరీ మొన్న సంక్రాంతికి తెలుగులో కూడా జరిగింది అదే కదా!?