Waltair Veerayya Collections: ‘టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ సినీ ప్రేక్షకులు ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నామస్మరణ చేస్తున్నారు..2018 వ సంవత్సరం నుండి సుమారుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు కన్నడ బాషలలో విడుదలైంది..నాలుగేళ్ళ తర్వాత వస్తున్నా షారుఖ్ ఖాన్ సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు మొదటి నుండి భారీ గానే ఉండేవి.

Waltair Veerayya Collections
దానికి తోడు సిద్దార్థ్ ఆనంద్ తో సినిమా కావడం, అది కూడా యాక్షన్ జానర్ అవ్వడం తో ప్రతీ ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు..అగ్నికి ఆజ్యం తోడైనట్టు టీజర్ , ట్రైలర్ కూడా అదిరిపోవడం తో అప్పటివరకు ఉన్న అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యాయి..ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి.
షారుఖ్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ కాబట్టి ఆయనకీ అక్కడ హైప్ ఉంటే భారీ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం సర్వసాధారణం..కానీ టాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రానికి విడుదలకు ముందు నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ తో సమానమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..ఇక ఈరోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం తో మొదటి రోజు నైజాం ప్రాంతం మొత్తం కలిపి 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Waltair Veerayya Collections
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఓపెనింగ్స్ ప్రభావం టాలీవుడ్ లో వసూళ్ల పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘వాల్తేరు వీరయ్య’ కి బ్రేక్ వేసింది..చాలా చోట్ల ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్ల పై ప్రభావం చూపించింది పఠాన్..ఇలా మన టాలీవుడ్ మెగాస్టార్ సినిమాపై బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా ప్రభావం పడే రేంజ్ లో ఉందంటే షారుఖ్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.