Pathan Collections: బాలీవుడ్ మార్కెట్ పూర్తి స్థాయిలో పడిపోయి సౌత్ ఇండియన్ మూవీస్ డామినేషన్ జరుగుతున్న సమయం లో బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం ని తీసుకొచ్చిన స్టార్ హీరో షారుఖ్ ఖాన్..ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పఠాన్’ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది..మొదటి రోజే ఏకంగా 106 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రం 5 రోజుల లాంగ్ వీకెండ్ లో ఒక్కో రికార్డు ని లేపుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఈ రికార్డుని ఎవరైనా ముట్టుకోగలరా అనే సందేహం కలిగించేలా చేసింది ఈ చిత్రం.

Pathan Collections
ఇండియన్ మార్కెట్ లో ప్రభంజనం సృష్టిస్తున్న ‘పఠాన్’ చిత్రం ఓవర్సీస్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది..ఈ చిత్రం 6 రోజులకు గాను ఎంత వసూళ్లను ఓవర్సీస్ లో రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ఈ చిత్రం ఇప్పటి వరకు ఓవర్సీస్ లో దాదాపుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 210 కోట్ల రూపాయిలను వసూలు చేసింది..మన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR ఓవర్సీస్ ఫుల్ రన్ లో 210 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది..ఇప్పుడు ఈ చిత్రం కలెక్షన్స్ ని కేవలం ఆరు రోజుల్లోనే దాటేసింది ‘పఠాన్’ చిత్రం..ఇప్పుడు ఈ సినిమా టార్గెట్ ‘బాహుబలి 2 ‘..ఓవర్సీస్ లో ఈ సినిమాకి దాదాపుగా 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Pathan Collections
ఈ వారం లోనే ఆ రికార్డుని బద్దలు కొడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇక ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికే ఈ చిత్రం 370 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అతి త్వరలోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.