Pathaan OTT: ‘పఠాన్’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పండగే
Pathaan OTT: ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన చిత్రం ‘పఠాన్’.ఇప్పటి వరకు కేవలం సౌత్ మూవీస్ మాత్రమే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకొని సెన్సేషన్ సృష్టించాయి.కానీ మొట్టమొదటి సారి ఒక బాలీవుడ్ మూవీ ఇలా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. చాలా కాలం నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ […]


Pathaan OTT
Pathaan OTT: ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన చిత్రం ‘పఠాన్’.ఇప్పటి వరకు కేవలం సౌత్ మూవీస్ మాత్రమే వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకొని సెన్సేషన్ సృష్టించాయి.కానీ మొట్టమొదటి సారి ఒక బాలీవుడ్ మూవీ ఇలా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది.
చాలా కాలం నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా ఇది.ఒక్క మాటలో చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమా ఎలాగో, షారుఖ్ ఖాన్ కి ‘పఠాన్’ మూవీ అలా అన్నమాట.అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.కేవలం బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే, ఈ సినిమాని ఈ నెల 22 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారట.తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని దాదాపుగా 200 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట.

Pathaan OTT
వెండితెర మీద అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా డిజిటల్ మీడియా లో కూడా అదే రేంజ్ అద్భుతాలు సృష్టిస్తుందో లేదో చూడాలి.ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా నటించాడు.’వార్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ఇది.ఈ చిత్రం తర్వాత షారుఖ్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తో ‘జవాన్’ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ సినిమా తో షారుఖ్ ఖాన్ సౌత్ లో కూడా మార్కెట్ ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు.