Parshuram vs Allu Aravind Controversy : విషయం ఏదైనా కరెక్ట్ గా ఉండేవాళ్లకు సొసైటీలో విలువ ఉంటుంది. మాట మీద నిలబడే వాళ్లపై గౌరవం ఏర్పడుతుంది. అలా కాకుండా నమ్మిన వాళ్ళను గజిబిజికి గురి చేస్తే ఏదో రోజు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొహమాటానికి పోకుండా ఉన్న మాట చెప్పి, లౌక్యంగా వ్యవహరిస్తే ఏ సమస్యా ఉండదు. ఎడా పెడా అడ్వాన్సులు తీసుకొని దర్శకుడు పరశురాం అభాసుపాలవుతున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని కమిటైన పరుశరామ్, దిల్ రాజు బ్యానర్ లో మూవీ ప్రకటించడం కొత్త వివాదానికి దారి తీసింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ గీత గోవిందం మూవీ చేశాడు. అది డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అల్లు అరవింద్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పరుశురాం కెరీర్లో గీత గోవిందం అతిపెద్ద హిట్. ఆయనకు బ్రేక్ ఇచ్చిన మూవీ. హిట్ ఇచ్చిన దర్శకుడని పరుశురాంకు అడ్వాన్స్ ఇచ్చి అల్లు అరవింద్ మరో మూవీ లాక్ చేశాడు. స్క్రిప్ట్ సిద్ధం చేసి హీరోని ఒప్పించి ప్రాజెక్ట్ పట్టాలెక్కించాల్సిన బాధ్యత పరశురాందే అన్నాడు. పరశురాంతో నెక్స్ట్ మూవీ నాదే అని ఎదురుచూస్తున్న అల్లు అరవింద్ కి పరశురామ్ షాక్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్లో మూవీ ప్రకటించడంతో ఆయన ఖంగుతిన్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ లో అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ ని భాగస్వామిని చేసి కూల్ చేయాలని, వివాదం కాకుండా చూడాలని పరశురామ్ ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించలేదని సమాచారం. పరశురాంని తీవ్రంగా దూషించి ఇకపై నా నుండి నీకు ఎలాంటి సప్పోర్ట్ ఉండదు. గీతా ఆర్ట్స్ లో మూవీ చేయలేవని హెచ్చరించి పంపాడని టాక్. కాగా గతంలో కూడా పరశురామ్ ఇలానే చేశారట. 14 రీల్స్ బ్యానర్ లో మూవీ చేస్తానని అడ్వాన్ తీసుకొని మైత్రీ మూవీ మేకర్స్ తో సర్కారు వారి పాట ప్రకటించారు.
14 రీల్స్ అధినేత అసహనం వ్యక్తం చేయగా… సర్కారు వారి పాట నిర్మాణ భాగస్వామిగా ఉండేలా చేశారట. అదే ఫార్ములా విజయ్ దేవరకొండ మూవీకి కూడా అప్లై చేద్దామని చూసి అల్లు అరవింద్ వద్ద భంగపడ్డారు. అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత వద్ద కూడా పరశురామ్ అడ్వాన్స్ తీసుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో సినిమా లాక్ అయ్యాకే అడ్వాన్స్ లు తీసుకుంటే మంచిది కదా అన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఒకవేళ నిర్మాతలు మొహమాట పెట్టి అడ్వాన్స్ చేతిలో పెడితే సున్నితంగా తిరస్కరిస్తే సరిపోతుంది. అత్యాశకు పోయి ముగ్గురు నలుగురు నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయకపోతే అందరికీ శత్రువై పరిశ్రమకు దూరం కావాల్సి వస్తుంది.