Panipuri: పానీపూరీ తినేవారికి ఇది హెచ్చరిక
Panipuri: ఇటీవల కాలంలో రోడ్డుపక్కన లభించే వంటకాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఏది పడితే అది కడుపులో వేసేస్తున్నారు. దీంతో మనకు ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయని తెలిసినా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉండే బండ్ల మీద చేసే పదార్థాలను రుచిగా ఉన్నాయని లాగించేస్తున్నారు. కానీ వాటి వల్ల వచ్చే ముప్పును గమనించడం లేదు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాం. బండ్ల మీద చేసే పదార్థాల్లో వాడే నూనెలు […]

Panipuri: ఇటీవల కాలంలో రోడ్డుపక్కన లభించే వంటకాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఏది పడితే అది కడుపులో వేసేస్తున్నారు. దీంతో మనకు ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయని తెలిసినా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉండే బండ్ల మీద చేసే పదార్థాలను రుచిగా ఉన్నాయని లాగించేస్తున్నారు. కానీ వాటి వల్ల వచ్చే ముప్పును గమనించడం లేదు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాం. బండ్ల మీద చేసే పదార్థాల్లో వాడే నూనెలు కూడా సురక్షితమైనవి కావని పలు సందర్భాల్లో చూస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం.

Panipuri, Director of Public Health Srinivasa Rao
ఈ మధ్య కాలంలో పానీపూరీకి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. రుచిగా ఉన్నాయని ఎలాంటి నిబంధనలు లేకుండా తినేస్తున్నారు. దీని వల్ల టైఫాయిడ్ లాంటి రోగాలకు కారకులవుతున్నారు. దీనిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందిస్తూ పానీపూరీ వల్ల టైఫాయిడ్ వస్తుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 2700 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. దీంతో పానీపూరీ వల్ల మన ఆరోగ్యం దెబ్బ తింటుందని చెబుతున్నారు. అందుకే దీనికి పానీపూరీ డిసీజ్ అని నామకరణం చేశారంటే దీంతో ఎంత ప్రమాదం ఉందో తెలుస్తోంది.
రుచిగా ఉన్నాయని చాలా మంది తింటున్నారు. కానీ వచ్చే ప్రమాదాలను లెక్కచేయడం లేదు. దీంతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పానీపూరీ తినడం వల్ల కామెర్లు, పేగుల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. పానీపూరీ ఎక్కువగా తీసుకోవడంతో టైఫాయిడ్ రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. దీంతో పానీపూరీని సాధ్యమైనంత వరకు తినొద్దని సూచిస్తున్నారు. టైఫాయిడ్ వ్యాపిస్తున్న సందర్భంలో పానీపూరీకి దూరంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు.

Panipuri
రోడ్డు పక్కన లభించే వాటికి చాలా మంది దగ్గరవుతున్నారు. మిర్చి, బజ్జీ, వడ, పూరీ ఏదైనా వారు వాడే నూనె మంచిది కాదు. ఒకసారి కాదు రెండు మూడుసార్లు వేడి చేసి వాడటంతో మనకు క్యాన్సర్ ముప్పు వాటిల్లే సూచనలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు రోడ్డు పక్కన దొరికే ఎలాంటి వాటిని కూడా తీసుకున్నా మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే కచ్చితంగా జిహ్వ చాపల్యానికి చెక్ పెట్టాల్సిందే. ఏది పడితే అది తింటూ మనకు అనారోగ్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తించుకోవాలి. ఆ దిశగా చర్యలు తీసుకుని టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
