Palm Oil Disadvantages: ప్రకృతి విధానంలో నూనె, ఉప్పు, కారం వాడకకూడదని చెబుతారు. నూనె వల్ల మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయనే సంగతి తెలిసినా పట్టించుకోవడం లేదు. 5 ఎంఎల్ నూనె మన శరీరంలోకి ఎక్కించుకుంటే మనకు మరణమే ింతటి ప్రమాకరమైన నూనెతో మనకు కలిగే ఇబ్బందులెన్నో ఉన్నా లెక్క చేయడం లేదు. ఉప్పు, నూనెలు విరివిగా వాడుతూ మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. ఫలితంగా పాతికేళ్లకే జబ్బుల బారిన పడుతున్నాం. అయినా లెక్కచేయడం లేదు. నూనెలు పీపాలకు పీపాలు వాడుతూ జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేకపోతున్నాం. ఫలితంగా వ్యాధుల బారిన పడుతున్నాం.

Palm Oil Disadvantages
మంచినూనె ఎంత ప్రమాకరమైందో తెలిస్తే మనం దాన్ని మానేయడం జరుగుతుంది. నూనెతో మన దేహం ఎన్నో తిప్పలు పడుతుంది. కాలేయం దెబ్బతింటుంది. నూనెలో దేవిన పదార్థాలను మనం రుచిగా తింటాం. కానీ లివర్ దాన్ని జీర్ణం చేసుకోవడంలో ఎన్నో తిప్పలు పడుతుంది. నోటికి రుచిగా ఉండేది మన కడుపుకు మాత్రం ఇబ్బందులు తెస్తుంది. అలాంటి నూనెలను మనం ఎన్నో రకాలుగా వాడుతున్నాం. ఒక మనిషి ఒక సంవత్సరంలో దాదాపు 8 కిలోల నూనె వాడుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
నూనెల్లో పామాయిల్ చౌకగా లభించేంది. దీంతో దీన్ని కూరల్లో ఇతర వంటకాల్లో ఎక్కువగా వాడుతున్నారు. దీంతో గుండె జబ్బుల ముప్పు ఉందని తెలిసినా విడిచిపెట్టడం లేదు. క్యాన్సర్ రావడానికి కూడా పామాయిలే పరోక్ష కారణంగా చెబుతున్నారు. కానీ ఇవేమీ లెక్కచేయడం లేదు. లితంగా మన గుండె జబ్బులు ఎక్కువ కావడానికి కారణమవుతున్నాం. నూనె లేనిదే ఏదీ తినడం లేదు. కూరల్లో కూడా విచ్చలవిడిగా నూనె పోస్తూ పదార్థాలను రుచిగా ఉన్నాయని లాగిస్తున్నాం.

Palm Oil Disadvantages
మారిషస్ దేశంలో పామాయిల్ బదులు సోయా నూనెను వాడుతున్నారు. దీంతో గుడ్డిలో మెల్ల అన్నట్లు కాస్త ఉపశమనం కలుగుతుంది. పామాయిల్ నూనెతో మనకు ఎన్నో అనారోగ్య సూచనలున్నా పట్టించుకోవడం లేదు. మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. పామాయిల్ వాడకాన్ని తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వాలు స్పందించి పామాయిల్ వాడకాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలి. లేదంటే భవిష్యత్ లో దీంతో చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది.