WTC Points Table: పరుగుల వరద పారిన రావల్పిండి టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పై ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయం సాంధించింది. 15 వందలకు పైగా పరుగులు ఆ మ్యాచ్ లో నమోదయ్యాయి. బ్యాట్స్ మెన్ పోటాపోటీగా పరుగులు సాధించారు. ఇరు జట్ల లో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు సెంచరీలు సాధించి కదం తొక్కారు. ఫలితం తేలదు అనుకున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు చివరి ఇన్నింగ్స్లో సత్తా చాటారు. పిచ్ కూడా సహకరించడంతో పాకిస్తాన్ వికెట్లు టపా టపా రాలిపోయాయి. దీంతో ఇంగ్లీష్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించింది.

WTC Points Table
మనకేంటి ఉపయోగం
క్రికెట్ లో మన ఆట తీరుతో పాటు ఎదుటి జట్టు ప్రదర్శన పై ర్యాంకు ఆధారపడి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి చెందిన నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కు సంబంధించి భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఒకవేళ భారత జట్టు తన తదుపరి సిరీస్ లను బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా జట్లతో ఆడుతుంది. భారత జట్టు ఆ సిరీస్ లు గనుక నెగ్గితే పాక్ జట్టు డబ్ల్యూ టీ సీ పైనల్ పోరుకు చేరుకోవడం కష్ట మవుతుంది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే సిరీస్ లో భారత్ 2_0 తేడాతో గెలుపొంది, ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్ లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోతే భారత్ రెండో స్థానం లో నిలుస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగే మిగతా మ్యాచ్ ల్లో పాకిస్తాన్ జట్టు ఇదే స్థాయి ప్రదర్శన చేస్తుంది అని అనుకోలేము.. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు ఆడుతున్నది స్వదేశంలో. పైగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుతో సమానంగా బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 74 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చింది.
2001లో ప్రారంభం
డబ్ల్యూటీసి ఛాంపియన్షిప్ 2001లో ప్రారంభమైంది. 2001నుంచి 2008 వరకు ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగింది.. 2009 నుంచి 2011 వరకు ఇండియా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.. 2012 కాలంలో ఇంగ్లాండ్, 2013, 14, 15 లో సౌత్ ఆఫ్రికా నంబర్ వన్ స్థానం లో నిలిచింది. 2016 లో ఆస్ట్రేలియా మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుంది. తర్వాత 2017 నుంచి 2020 వరకు ఇండియా అగ్రస్థానంలో కొనసాగింది. 2021లో న్యూజిలాండ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు. ఈ సారి ఈ జాబితాలో ప్రధానంగా పోటీ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉంది.

WTC Points Table
ఈ జట్లే సాధించాయి
డబ్ల్యూటీసి ఛాంపియన్షిప్ ను ఇప్పటివరకు కేవలం ఐదు జట్లు మాత్రమే సాధించాయి. ఆస్ట్రేలియా ఎక్కువసార్లు ఈ జాబితాలో ప్రథమ స్థానం లో నిలవగా, ఆ తర్వాత ఇండియా ఉంది. సౌత్ ఆఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి. టెస్ట్ అంటే ఐదు రోజులు సాగుతుంది కాబట్టి… క్రీడాకారులకు ఎంతో ఫిట్నెస్ ముఖ్యం. ఇక 2001 నుంచి ప్రారంభమైన ఈ జాబితాలో ఇప్పటివరకు కేవలం ఐదు జట్లు మాత్రమే చోటు సంపాదించడం గమనార్హం. శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్ ఇంతవరకు బోణీ కొట్టకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.