TANA : జూలై 7 నుంచి తానా 23వ మహాసభలు.. ప్రత్యేక అతిథిగా హాజరయ్యే ‘ధాజీ’ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

TANA  : కమలేష్ దేశాయ్ భాయ్ పటేల్.. ఈయనను ముద్దుగా అందరూ ‘ధాజీ’ అని పిలుస్తుంటారు. ఇటీవలే ఆయన ఆధ్యాత్మికత కోసం విశేష కృషి చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ను బహూకరించింది. రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ కమలేష్ డి. పటేల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఇంతకీ ఈ కమలేష్ ఎవరు? ఏం చేస్తారు? ఎందుకు అవార్డ్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ […]

  • Written By: Naresh
  • Published On:
TANA  : జూలై 7 నుంచి తానా 23వ మహాసభలు.. ప్రత్యేక అతిథిగా హాజరయ్యే ‘ధాజీ’ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

TANA  : కమలేష్ దేశాయ్ భాయ్ పటేల్.. ఈయనను ముద్దుగా అందరూ ‘ధాజీ’ అని పిలుస్తుంటారు. ఇటీవలే ఆయన ఆధ్యాత్మికత కోసం విశేష కృషి చేస్తున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ను బహూకరించింది. రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ కమలేష్ డి. పటేల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఇంతకీ ఈ కమలేష్ ఎవరు? ఏం చేస్తారు? ఎందుకు అవార్డ్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

-కమలేశ్​ డి.పటేల్ ఎవరు?
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ధ్యాన గురువు కమలేశ్​ డి.పటేల్. అహ్మదాబాద్‌లో 1956లో జన్మించాడు. ఆయన ఫార్మసీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం మొదలుపెట్టి గురువు రామచంద్ర (బాపూజీ) దగ్గర 1976 నుంచి సాధన ఆరంభించాడు. కమలేష్ అహ్మదాబాద్ ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ చేశాక న్యూయార్క్ లో పీజీ చేసి అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించాడు. 1983లో గురువు రామచంద్ర (బాపూజీ) మరణంతో అధ్యక్షుడిగా పార్థసారథి రాజగోపాలాచారి(చారిజీ) బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి 2003 నుంచి శ్రీరామచంద్ర మిషన్ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యాడు. కమలేష్ డి పటేల్ 2014 నుంచి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ భారత్ తో పాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యశాలలు నిర్వహించాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చెగూరులో 1400 ఎకరాల్లో శ్రీరామ చంద్ర మిషన్ (కన్హా శాంతివనం) విస్తరించాడు. ఆయన రాసిన ది హార్టుల్నెస్ వే పుస్తకానికి విశేష ఆదరణ లభించింది.

-మార్చి 22న పద్మ పురస్కారం

హార్ట్‌ఫుల్‌నెస్ మూవ్‌మెంట్ స్థాపకుడు మరియు ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన కన్హ శాంతి వనాన్ని అభివృద్ధి చేసి విశేష సేవలందిస్తున్న ధాజీకు పద్మభూషణ్ సత్కారం లభించింది. మార్చి 22న రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా అందుకున్నారు.

-ఆధ్యాత్మిక సేవలో కమలేష్..
కమలేష్ ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. శ్రీరామచంద్ర మిషన్‌‌‌‌ అధ్యక్షుడిగా కొనసాగడంతోపాటు గ్లోబల్ గైడ్ అఫ్ హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా ఆధ్యాత్మిక యోగా, విద్యా విభాగాల్లో సేవలందిస్తున్నాడు. సహజ్ మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ ను నడిపిస్తున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేసే గురువుగా ఉన్నారు.

-23వ తానా మహాసభలకు ముఖ్య అతిథిగా కమలేష్

23వ తానా మహాసభలు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జులై 7,8,9వ తేదీల్లో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ప్రత్యేక అతిథిగా కమలేష్ దేశాయ్ పటేల్ ను ఆహ్వానించారు. ధాజీకి పద్మభూషణ్ సత్కారం జరగడం పట్ల తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, 23వ మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి హర్షం వ్యక్తం చేశారు.

-న్యూజెర్సీలో 23వ తానా మహాసభల సన్నాహాక సమావేశం
23వ తానా మహాసభల సన్నాహక సమావేశాన్ని న్యూజెర్సీ రాష్ట్రంలో నిర్వహించారు. ఈ మహాసభల కోసం ఫండ్ రైసింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ఎన్నారైలు హాజరయ్యారు. తెలుగువారితో ఎడిసన్ లోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ అంతటా సందడి వాతావరణం నెలకొంది. పలువురు దాతలకు తానా బృందం సత్కరించింది.

ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు మరణించిన ప్రముఖ దర్శకులు విశ్వనాథ్, జయలక్ష్మి గార్లకు, సినీ నటుడు నందమూరి తారకరత్నకు నివాళులర్పించారు.

Tags

సంబంధిత వార్తలు