Canada: అమెరికాను కాదని ఆ దేశానికి వలసలు.. ఎందుకో తెలుసా?
అమెరికాకు వెళ్లే వారు ఎక్కువ శాతం సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారే ఉంటారు. ఐటీలో ప్రతిభా వంతులకు ఇక్కడ బోలెడు అవకాశాలు ఉంటాయి. కేవలం అమెరికానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లోనూ భారతీయులు స్థిరపడ్డారు.

Canada: భారత్ ఉన్నత చదువులు అభ్యసించిన చాలా మంది ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముందుగా ఆలోచించేంది అమెరికా గురించే. ఇక్కడైతే ప్రతిభా ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకం. అంతేకాకుండా భారీగా జీతాలు ఉండడంతో పాటు ప్రమోషన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకరి ద్వారా మరొకరు అన్నట్లు ఇప్పటికే చాలా మంది అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. కానీ ప్రతి ఒక్కరూ అమెరికాకు వెళ్తే ఏముంటుంది? కొత్తగా ఏదైనా ఆలోచించాలని చాలా మంది మరోదేశం వైపు పయనిస్తున్నారు. అయితే అలా వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే?
అమెరికాకు వెళ్లే వారు ఎక్కువ శాతం సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారే ఉంటారు. ఐటీలో ప్రతిభా వంతులకు ఇక్కడ బోలెడు అవకాశాలు ఉంటాయి. కేవలం అమెరికానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లోనూ భారతీయులు స్థిరపడ్డారు. కానీ ఇక్కడ ఉద్యోగార్థుల సంఖ్య విపరీతంగ పెరగడంతో జాబ్స్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పైగా అమెరికా వీసాల్లో పలు మార్పుల కారణంగా ఆ దేశానికి వెళ్లేందుకు అనాసక్తి చూపుతున్నారు.
ఈ తరుణంలో అమెరికా కంటే కెనడా బెస్ట్ అంటున్నారు ఐటీ నిపుణులు. టెకీలకు కెనడా స్వర్గధామం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏడాది కాలంగా భారత్ నుంచి కెనడాకు ఐటీ నిపుణులు 15 వేల కంటే ఎక్కువగా వలసలు వెళ్లినట్లు ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా గణాంకాలు తెలుపుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారు కలుపుకొని మొత్తం 32 వేల కు పైగానే కెనడాకు పయనం అయినట్లు తెలుస్తోంది.
అమెరికాలో కంటే కెనడాలో ఐటీ ఉద్యోగులకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ భారీగా జీతాలు ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ దేశం ఐటీ రంగంలో వృద్ధి చెందుతుండడంతో ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటున్నాయి. ఐటీలో నైపుణ్యం ఉంటే కెనడాకు వెళ్లడం మంచిదేనని కొందరు ఇండియన్ కు చెందిన వారు చెబుుతున్నారు. ఈ నేపథ్యంలో కెనడాలో ఇండియా వలసదారులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
