NTR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఎన్టీఆర్ చరణ్ తో తన స్నేహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Tarak, Charan
ఇంతకీ ఎన్టీఆర్ ఏమి మాట్లాడారు అంటే.. ఎన్టీఆర్ మాటల్లోనే.. ‘దాదాపు చరణ్ – మా ఫ్యామిలీస్ మధ్య 30-35 సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అయితే.. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ తో మా మధ్య పోటీని మంచి స్నేహంగా మార్చాడు. అయితే, కేవలం ఆర్ఆర్ఆర్ వల్లే నేను, చరణ్ స్నేహితులం కాలేదు. ఎన్నో ఏళ్లుగా చరణ్ కి నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.
అయితే మా స్నేహబంధాన్ని మేము ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. మా ఫ్రెండ్ షిప్ గురించి రాజమౌళి ఒక్కడికే తెలుసు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా అందరికీ తెలిసింది’ అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, అలియా, శ్రియ నటించారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే.
రాజమౌళి మెస్మరైజింగ్ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా కోసం ప్రముఖులు సైతం ఇలా ప్రత్యేక ఆసక్తి చూపించడం గొప్ప విషయం. ఎలాగూ ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. పైగా గతంలో ఏ సినిమాకి రానివిధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకే.. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వెండితెర పై ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

Tarak, Charan
అన్నట్టు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొంచెం లావు పెరిగారు. అయితే, తాజాగా తారక్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తారక్ కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 8 కేజీలు తగ్గాలని కసరత్తులు చేస్తున్నాడు. జూన్ నుంచి కొరటాల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నాడు.