OTV Introduces Lisa: యాంకర్స్, జర్నలిస్టులు ఇక మీరు అక్కర్లేదు..

ఏఐ ప్రతికూల ప్రభావం చూపే తదుపరి రంగం లీగల్‌. కాంట్రాక్ట్‌ ఒప్పందాల విశ్లేషణ లాంటి చాలా అంశాలు ‘ఆటోమేషన్‌’ పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇంకో అడుగు ముందుకేసి న్యాయస్థానాల్లో గతంలో వెలువడ్డ తీర్పు­ల ఆధారంగా తాజా కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసే స్థాయి ఏఐకి ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం.

  • Written By: Raj Shekar
  • Published On:
OTV Introduces Lisa: యాంకర్స్, జర్నలిస్టులు ఇక మీరు అక్కర్లేదు..

OTV Introduces Lisa: హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ 2004లో నటించిన చిత్రం ‘ఐ–రోబోట్‌’ గుర్తుంది కదా! అందులో రోబోలు మానవ సైకాలజీ ఆధారంగా పనిచేస్తా­యి. అమెరికాలో 2035 నాటికి ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని నిర్మించిన ఊహాజనిత చిత్రమది. పరి­స్థితి అంతలా కాకున్నా.. 2045 నాటికి మానవ మేధస్సుతో సమానంగా పోటీపడే సాంకేతిక పరిజ్ఞా­నం సాధ్యమేనంటున్నారు.. టెక్‌ నిపుణులు. ప్ర­స్తు­త ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీ’­ని దాటి మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీ­సు­కు­ని సమస్యలు పరిష్కరించే స్థాయికి చేరుకుంది.

అన్ని రంగాల్లోకి..
ఇకపై వచ్చే టెక్నాలజీ మనిషితో పోటీపడుతుందని.. అది ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజñన్స్‌ టెక్నాలజీ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికతతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తాయని చెబుతున్నారు. భవిష్యత్‌ అంతా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌దే అని అంటున్నారు. వారి అంచనాల ప్రకారమే ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ క్రమంగా ఒక్కోరంగాన్ని ఆక్రమిస్తోంది. ఇప్పటికే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానమంతో మన జీవితంఎంతో కష్టమైన పనులన్నీ సులభతరమయ్యాయి. విద్య, వైద్యం, పరిశ్రమలు, ఆర్మీ, నేవీ, శుభకార్యాలు, అశుభకార్యాలు.. ఇలా కార్యక్రమం ఏదైనా.. సంస్థ ఏరంగమైనా సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరైంది. ఈ క్రమంలో ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌(కృత్రిమ మేధ) ఇప్పుడు అన్నిరంగాలకు విస్తరిస్తోంది. మన ఊహకు అందని విషయాలను, భవిష్యత్, వర్తమానాలను కూడా ఏఐ అంచనా వేస్తోంది.

ఏఐతో ఏ పనైనా సుసాధ్యమే..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొన్ని విభాగాలలో కొంతమేర వినియోగిస్తున్నట్టు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వీటిని పూర్తిస్థాయి టెక్నాలజీతో అనుసంధానం చేస్తే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. రోగి డేటా ఆధారంగా ఔషధాలను కూడా సిఫారసు చేయవచ్చంటున్నారు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లలో వినియోగిస్తే.. రోడ్డుపై ఇతర వాహనాలు, వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు డ్రైవింగ్‌ నిబంధనలకు కట్టుబడి ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. ప్రమాదాలను ముందుగానే నూరు శాతం గుర్తించి గమనాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని వివరిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ..
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలైంది. తాజాగా ఏఐని సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంక్షోభం ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్‌ రంగంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక ఏఐ అందుబాటులోకి వస్తే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో పని ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంజినీర్లు చేయాల్సిన పని రోబోలే చేస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో 30 కోట్ల మంది రోడ్డున పడే అవకాశం ఉంది.

కోర్టు తీర్పులను అంచనా వేసే స్థాయికి..
ఏఐ ప్రతికూల ప్రభావం చూపే తదుపరి రంగం లీగల్‌. కాంట్రాక్ట్‌ ఒప్పందాల విశ్లేషణ లాంటి చాలా అంశాలు ‘ఆటోమేషన్‌’ పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇంకో అడుగు ముందుకేసి న్యాయస్థానాల్లో గతంలో వెలువడ్డ తీర్పు­ల ఆధారంగా తాజా కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసే స్థాయి ఏఐకి ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం.

మీడియా రంగంలో..
తాజాగా ఏఐని మీడియారంగంలోనూ ప్రవేశపెట్టారు. దేశంలోనే తొలిసారిగా ఒడిశాకు చెందిన ఓటీవీ చానెల మొదటి సారిగా ఏఐ పరిజ్ఞానం ఉపయోగించి కృత్రిమ మహిళతో వార్తలు చదివించింది. ఇందులో ఆర్టిఫీషియల్‌ మహిళ మహుళ భాషలను సరళంగా మాట్లాడింది. అయితే ప్రస్తుతం ఒడిశా, ఇంగ్లిష్‌లో మాత్రమే వార్తలు చదువుతోంది. భవిష్యత్‌లో ఏఐ యాంకర్లు వీక్షకుల ప్రశ్నలకు సమాధానం కూడా చెబుతారని చానెల్‌ ఎండీ తెలిపారు. ఇది క్రమంగా అన్ని చానెళ్లకు విస్తరించే అవకాశం ఉంది. అదే జరిగితే భవిష్యత్‌లో న్యూస్‌ రీడర్స్, రిపోర్టర్స్, యాంకర్ల అవసరం ఉండదని నిపుణులుపేర్కొంటున్నారు.

సగం ఉద్యోగాలకు కోత!
ఏఐ ప్రవేశంతో గరిష్టంగా ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ ఉద్యోగాల్లో 46 శాతం కోత ప్రభావం ఉంటుందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ నివేదిక అంచనా వేసింది. సమావేశాలను షెడ్యూ ల్‌ చేయడం, నివేదికలు రూపొందించడం, డేటా సిద్ధం చేసి అందించడం లాంటివి ఈ ఉద్యోగాలను నిర్వర్తించే వారి ప్రధాన విధులు. ఏఐ వల్ల ఇలాంటి ఉద్యోగుల అవసరం దాదాపు సగం తగ్గుతుందని అంచనా.

ప్రయోజనంతోపాటు ముప్పు..
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను ఎంత ఈజీగా మారుస్తున్నాయో.. అంతే ముప్పుగా కూడా పరిణమిస్తున్నాయి. ఏఐ రోబోలు మా­నవ మేధస్సును మించిపోతే ముప్పు కూడా ఉండొచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్‌.. ఒకప్పుడు కేవలం మాట్లాడే సాధనంగానే ఉండేది. ఆన్‌డ్రాయిడ్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చింది. అయితే ఇదే సమయంలో నేరాలు, అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ సంబంధాలకు కూడా ఇదే ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ కారణమవుతోంది. ఇక ఏఐతో మనిషి జీవితంలో పెను మార్పులు వస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మనషి చేసే పనులతోపాటు చేయలేని పనులను కూడా ఏఐ చేస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని వివిధ రంగాల్లో ఉపయోగిస్తున్నారు. విద్య, వైద్యంలో అద్భుతంగా పనిచేస్తుంది. భవిష్యత్, గడిచిన కాలం గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడంలోనూ ఏఐ తోప్పాటు అందిస్తోంది.

Read Today's Latest Technology News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు