Aditya L-1 : “ఆపరేషన్‌ ఆదిత్య”.. ఇస్రో అసలు లక్ష్యం ఇదే

2017లో జ్యూరిక్‌ విమానాశ్రయంలో దాదాపు 15 గంటల పాటు ఇబ్బదులు ఎదురయ్యాయి. అందుకే సూర్యుడి మీద ఓ కన్నేసి ఉంచేందుకు ఇస్రో ఆదిత్య ఎల్‌-1ను నింగిలోకి పంపింది.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Aditya L-1 : “ఆపరేషన్‌ ఆదిత్య”.. ఇస్రో అసలు లక్ష్యం ఇదే

Aditya L-1 : సూర్యుడు కాంతి పుంజంమాత్రమే కాదు. నిగూఢమైన అద్భు తాల పుట్ట ఆ సౌర గ్రహంలో విధ్వంసకరమైన తుఫాన్లు ఏర్పడ తాయి. ప్లాస్మాలు ఉంటాయి. విస్ఫోటమైన జ్వాలలు ఏర్పడతాయి. ఇప్పటి దాకా వీటి గురించి ఒక స్థాయి అవగాహన మాత్ర మే ఉండేది. పూర్తిస్థాయిలో సూర్యుడి గురించి అవ గాహన లేకపోవడం వల్ల వ్యోమనౌకలు, రోదసీలోని ఉపగ్రహాలు తరుచూ ప్రమాదానాకి గురవుతూ ఉండేవి. ఇవి ఆయా అంతరిక్ష ప్రయోగ కేంద్ర సంస్థలకు తీరని ఇబ్బందిగా ఉండేది. ఇటీవల చంద్రడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి, జాబిల్లి దక్షిణ ధ్రువం మీద ల్యాండర్‌ను దింపి, సల్ఫర్‌ ఆనవాళ్లను కనుగొన్న ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 పేరుతో ఏకంగా సూర్యుడి మీదకు ఓ ఉపగ్రహాన్ని పంపింది. ఇంతకీ ఈ సూర్యుడి అద్భుతాల పుట్టనా? మనకు తెలియని అద్భుతాలు ఏమున్నాయి? ఆదిత్య ఎల్‌-1 ఏం చేస్తుంది? ఈకథనంలో ఈ తెలుసుకుందాం.

సూర్యుడు హైడ్రోజన్‌, హీలియంతో కూడిన ఒక భారీ గోళం. భూమిపై జీవులకు అది మూలాధారం. భానుడి గురత్వాకర్షణ శక్తి, సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటినీ పట్టి ఉంచుతోంది. సూర్యుడి నుంచి రేడియోధార్మికత, వేడి, ఆవేశిత రేణువుల విడుదలవుతుంటాయి. వాటి ప్రభావం భూమి మీద ఉంటుంది. భానుడి నుంచి నిరంతరం ప్రవహించే రేణువులను సౌరగాలిగా పేర్కొంటారు. అందులో శక్తివంతమయిన ప్రొటాన్లు ఉంటాయి. సౌర కుటుంబం మొత్తం ఈ గాలితో పాటు సూర్యుడి ఆయస్కాంత క్షేత్రం ఆవరించి ఉంటుంది. సూర్యుడి ఆయస్కాంత తీరూతెన్నులు, ఇతర అంశాల్లో వచ్చే మార్పుల కారణంగా సౌర తుఫాన్లు చెలరేగుతాయి. ఇలాంటి పరిణామాల వల్ల భానుడి నుంచి సౌర జ్వాలలు, ప్లాస్మా, ఆవేశిత రేణువులు అంతరిక్షంలోకి దూసుకొస్తుంటాయి.

అయితే పై పరిణామాలల్లో ప్రధానమైనది కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌(సీఎంఈ). దీన్ని సౌర కంపంగా కూడా పేర్కొంటారు. దీనివల్ల కోట్ల టన్నుల మేర సౌర పదార్థాలు సెకనుకు మూడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంటాయి. వీటిలో కొన్ని భూమి దిశగా కూడా రావొచ్చు. సీఎంఈల్లోని ఆవేశిత రేణువుల తాకిడి వల్ల ఈ గ్రహాల్లోని ఎలకా్ట్రనిక్‌ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల కమ్యూనికేషన్‌, జీపీఎస్‌ తదితర అంతరిక్ష ఆదారిత సేవలకు అవరోధం ఏర్పడుతుంది. రోదసీలోని వ్యోమగాములకూ ఇది అత్యంత హనికరం. ఉత్తర, దక్షిణ ధ్రువాలు కలిగిన ఒక అయస్కాంతంలా భూమి పని చేస్తుంది. పుడిమిని చేరుకోగానే సీఎంఈ రేణువులు.. భూ అయస్కాంత క్షేత్ర రేఖల గుండా పయనిస్తాయి. ఈ క్రమంలో భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల హై-వోల్టేజీ ట్రాన్స్‌ ఫార్మర్లపై ప్రభావం పడుతుంది. 1989లో సూర్యుడి నుంచి భారీగా ఆవేశిత రేణువులు దూసుకొచ్చాయి. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‌లో 72 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 2017లో జ్యూరిక్‌ విమానాశ్రయంలో దాదాపు 15 గంటల పాటు ఇబ్బదులు ఎదురయ్యాయి. అందుకే సూర్యుడి మీద ఓ కన్నేసి ఉంచేందుకు ఇస్రో ఆదిత్య ఎల్‌-1ను నింగిలోకి పంపింది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు