Oppenheimer Review : ఓపెన్ హీమెర్’ మూవీ ఫుల్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ట్రైలర్ చూసినప్పుడు ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా అయితే ఉంటుంది అనుకున్నారో అంతకు మించి గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

  • Written By: Vicky
  • Published On:
Oppenheimer Review : ఓపెన్ హీమెర్’ మూవీ ఫుల్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

Oppenheimer Review : రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తావు , హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాల కోసం కూడా అంతలా ఎదురు చూస్తుంటారు. ఆయన తెరకెక్కించే సినిమాలు అంటే ఇండియన్ ప్రేక్షకులకు పిచ్చి. ముఖ్యంగా యూత్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇంద లో విడుదలైన నోలన్ సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. మన దర్శకుల టేకింగ్ మీద కూడా నోలన్ సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. ఆయన తెరకెక్కించే విధానం తో తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి.’టెనెట్’ తర్వాత ఆయన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘ఓపెన్ హీమెర్’. ఈ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనాలు మామూలు రేంజ్ వి కాదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

ఈ చిత్రం కై బర్డ్ , మార్టిన్ జె శర్విన్ జీవిత కథలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. 1942 వ సంవత్సరం లో మాన్ హట్టన్ ప్రాజెక్ట్ కోసం ఓపెన్‌హీమెర్ ని తీసుకుంటారు. ఆయన పని తీరుని ఎంతో నచ్చి ఏడాది లోనే ఆయనని న్యూ మెక్సికో ఉన్నటవంటి ప్రాజెక్ట్ లాస్ అలోమోస్ లేబొరేటరీ కి డైరెక్టర్ గా తీసుకుంటారు. ఈ ల్యాబ్ నుండి న్యూక్లియర్ ఆయుధాలను తయారు చెయ్యడమే లక్ష్యం. మరి ఓపెన్ హీమేర్ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేశాడా..?, ఈ క్రమం లో ఆయనకీ ఎదురైనా సవాళ్లు ఏమిటి?, ఎలా వాటిని ఎదురుకున్నాడు అనేదే స్టోరీ.

విశ్లేషణ :

క్రిస్టోఫర్ నోలన్ తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను విన్నూతన రీతిలో సరికొత్త అనుభూతి ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ వెనుక జరిగిన చీకటి కోణాన్ని ఎంతో ధైర్యం ప్రేక్షకులకు కళ్ళకు కట్టే విధంగా ఆయన చూపించిన విధానం అద్భుతం అనే చెప్పాలి. ప్రతీ చిన్న సన్నివేశానికి ఆయన ఇచ్చిన డిటైలింగ్ ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఈ సినిమా లో ‘ఐరన్ మ్యాన్’ హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ నటన అద్భుతంగా అనిపించింది. ప్రతీ ఎమోషన్ ని ఆయన చాలా చక్కగా పండించాడు. సినిమా మూడు గంటలు ఉన్నప్పటికీ అప్పుడే అయిపోయిందా అని ఆడియెన్సు అనుభూతి చెందే విధమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నోలన్. ఇక ఈ సినిమా ని చూసిన ఎవరికైనా కూడా కచ్చితంగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డ్స్ మొత్తాన్ని గెలుచుకుంటుంది అని అంటారు. ఆ రేంజ్ లో టెక్నీకల్ గా బ్రిలియంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

చివరి మాట :

ట్రైలర్ చూసినప్పుడు ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా అయితే ఉంటుంది అనుకున్నారో అంతకు మించి గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

రేటింగ్ : 3.5 /5

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు