BJP- TDP And Jana Sena: వైసీపీని దూరం పెడితేనే.. బీజేపీకి టీడీపీ, జనసేన షరతు
రాజకీయంలో అవసరాలకు తప్ప మరోదానికి చాన్స్ లేదు. నిన్నటివరకూ బీజేపీ అవసరమని భావించిన చంద్రబాబు వెంటపడ్డారు. ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవాలంటే పొత్తులు అనివార్యం.

BJP- TDP And Jana Sena: మా రూటు సెపరేటు.. కుటుంబ పార్టీలకు దూరం..మొన్నటివరకూ ఏపీ బీజేపీ నేతల స్వరం ఇది. తాము వైసీపీ, టీడీపీలకు సమదూరం పాటిస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎంత బతిమలాడుకున్నా కలిసే ప్రసక్తే లేదని.. జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే ఇదంతా నిన్న, మొన్నటివరకే. క్రమేపీ బీజేపీ నేతల స్వరం మారుతోంది. కాస్తా సవరించుకొని మాట్లాడుతున్నారు. టీడీపీతో కలిసి పనిచేస్తామన్న పవన్ ప్రతిపాదనను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని..అక్కడ చర్చలు జరుగుతున్నాయని మాట మార్చారు. అయితే ఈ మార్పు వెనుక మాత్రం ఏదో జరుగుతోందన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్ లో కనిపిస్తున్నాయి. టీడీపీ అంటేనే ఇంతెత్తుకు ఎగిరే జీవీఎల్, సోము వీర్రాజు వంటి నాయకుల నుంచి సానుకూల మాటలు వస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది.
వ్యూహాత్మకంగా టీడీపీ..
అయితే నిన్న మొన్నటి వరకూ పొత్తుల ప్రాపకం కోసం ప్రయత్నించిన టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల వల్లో.,. లేకుంటే పొత్తులు లేకుండా వెళితే బీజేపీ పరువుపోవడం ఖాయమనో తెలియదు కానీ మునుపటిలా టీడీపీ ఆసక్తి కనబరచడం లేదు. అంతకంటే మించి ఇంకా వైసీపీతో బీజేపీ స్నేహం కొనసాగిస్తుండడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూస్తే అనుమానాలకు బలం చేకూరుస్తున్నారు. వైసీపీకి బీజేపీ దగ్గరగా ఉందని.. ఆ మాట మేం చెప్పడం లేదని.. ప్రజలే అనుకుంటున్నారని కామెంట్స్ చేశారు. సో తమకు దగ్గరవ్వాలంటే బీజేపీ వైసీపీ స్నేహాన్ని వదులుకోవాలన్న మాట. అంతెందుకు కొద్దిరోజుల కిందట ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి పోటీచేసి ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఇటువంటి వ్యాఖ్యే చేశారు. తన ఓటమికి బీజేపీ, వైసీపీ ఒక్కటేనని ప్రజలు భావించడమే కారణమని చెప్పుకొచ్చారు.
ఎవరి అవసరం వారిది..
రాజకీయంలో అవసరాలకు తప్ప మరోదానికి చాన్స్ లేదు. నిన్నటివరకూ బీజేపీ అవసరమని భావించిన చంద్రబాబు వెంటపడ్డారు. ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవాలంటే పొత్తులు అనివార్యం. దీంతో చంద్రబాబు అవసరం కావడంతో ఆయన వైపు చూడని అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అయితే కలిసి నడవాలునుకుంటున్న టీడీపీ, జనసేనలు ఒకే ఒక అభ్యంతరాన్ని బీజేపీ ముందు పెడుతున్నాయి. కేంద్రం నుంచి వైసీకి వ్యక్తిగతంగా అందుతున్న సాయాన్ని నిలపివేయాలంటున్నాయి. ప్రభుత్వానికి అడ్డగోలు అప్పులు ఆపేయడం, నిబంధనల ప్రకారం పాలించేలా చేయడం, చట్ట విరుద్ద పనలును తక్షణం నిలిపివేసేలా చూడటం వంటివి చేయాలని భావిస్తున్నాయి.
అదే చేస్తే..
కేంద్రం నుంచి సాయం నిలిచిపోతే జగన్ సర్కారు ఆటోమేటిక్ గా ప్రజల ముందు దోషిగా నిలబడే అవకాశముందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి, పొత్తులకు శుభారంభం పలకవచ్చని.. వైసీపీకి గట్టి హెచ్చరికలు పంపించి అధికారం వైపు అడుగులు వేయవచ్చని చెబుతోంది. అలాగే వ్యక్తిగత కేసుల విషయంలోనూ వైసీపీకి బీజేపీ సహకరిస్తోందన్న అభిప్రాయం ఉంది. దాన్ని కూడా మార్చాలంటున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని రాజ్యాంగ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుందో లెక్కే లేదు. వాటి గురించి ప్రస్తావిస్తోంది. ఇప్పుడు బీజేపీ… టీడీపీ, జనసేనతో కలిసి నడవాలంటే ఖచ్చితంగా వైసీపీకి దూరమని ఫ్రూవ్ చేసుకోవాలి. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఒకటే అభిప్రాయంతో ఉండడం విశేషం.
