Onion : చెడు కొవ్వును కరిగించే ఉల్లిపాయ.. ఇలా తినాలి

Onion : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అంతటి ప్రొటీన్లు ఉన్నాయి. చెడు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ వినియోగంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. చెడు కొవ్వును ఎల్ డీఎల్, మంచి కొవ్వును హెచ్ డీఎల్ అని పిలుస్తుంటారు. చెడు కొవ్వు గుండెకు ముప్పు తీసుకొస్తుంది. మంచి కొవ్వు మన గుండెకు మంచి చేస్తుంది. అందుకే గుడ్ కొలెస్ట్రాల్ ఎంతో అవసరం ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో ఇరుకుగా […]

  • Written By: Shankar
  • Published On:
Onion : చెడు కొవ్వును కరిగించే ఉల్లిపాయ.. ఇలా తినాలి

Onion : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అంతటి ప్రొటీన్లు ఉన్నాయి. చెడు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ వినియోగంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. చెడు కొవ్వును ఎల్ డీఎల్, మంచి కొవ్వును హెచ్ డీఎల్ అని పిలుస్తుంటారు. చెడు కొవ్వు గుండెకు ముప్పు తీసుకొస్తుంది. మంచి కొవ్వు మన గుండెకు మంచి చేస్తుంది. అందుకే గుడ్ కొలెస్ట్రాల్ ఎంతో అవసరం ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో ఇరుకుగా ఉంటుంది. దీంతో రక్తసరఫరాపై ప్రభావం పడుతుంది.

ధమనుల నుంచి రక్తం, ఆక్సిజన్ లు స్వేచ్ఛగా ప్రవహించలేవు. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. చెడు కొవ్వు ధమనులను పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనుసరిస్తే కొవ్వును తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. ఎక్కువగా ఉల్లిపాయలు తినే వారిలో మంచి కొవ్వు పెరుగుతుంది. చెడు కొవ్వు తగ్గుతుంది. దీంతో చెడు కొవ్వు స్థాయిలు తగ్గినట్లు పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి.

ఉల్లిపాయలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు , సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్లను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. ఇవి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రక్తం గడ్డ కట్టకుండా సాయపడతాయి. దీంతో పచ్చి ఉల్లిని తీసుకోవడం వల్ల కూడా ఎంతో మేలు కలుగుతుంది.

రక్తంలో ప్లేట్ లెట్లు కలవకుండా నిరోధించడానికి ఉపయోగపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ను పంచడానికి తోడ్పడతాయి. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇలా ఉల్లిపాయలు మన జీవితంలో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉల్లిపాయల వినియోగంతో మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేందుకు పాటుపడుతాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల ను తీసుకుంటూ మన శరీరంలోని జబ్బులకు చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వల్ల రక్తనాళాల వాపును తగ్గిస్తాయి.

Tags