Jagananna Ammavodi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసపుత్రిక అమ్మఒడి పథకం. ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుకునే విద్యార్థులకు ప్రతి రోజు రూ. 15 వేలు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ప్రతి ఏడాది 80 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,500 కోట్లు జమ చేస్తున్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని జగన్ ఆలోచన. ఇందుకు గాను అప్పు చేసి మరీ వారికి నగదు జమ చేస్తూ పథకాన్ని కొనసాగిస్తన్నారు.

jagan
ఈసారి మాత్రం 75 శాతం హాజరు ఉన్న వారికే పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పథకం అమలు తేదీని కూడా జనవరి నుంచి జూన్ కు మార్చింది. దీంతో ఈ సారి పథకాన్ని జూన్ 21 నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పథకంలో మార్పులు తీసుకురావడంతో తల్లులు పరేషాన్ అవుతున్నారు. ఇలా హాజరు శాతం మెలిక పెట్టడంతో చాలా మంది పథకానికి అర్హులు కారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telangana Congress Rachabanda: ‘రచ్చబండ’ కాంగ్రెస్ పార్టీని రక్షిస్తుందా?
ఇప్పుడు వారికి ఇచ్చే రూ. 15 వేల నుంచి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ. వెయ్యి కట్ చేయనున్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు మరో వెయ్యి కత్తిరించి రూ. 13 వేలు వారి ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోది. దీనిపై తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఖాతాల నుంచి డబ్బులు తీసి పాఠశాలలకు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు.

jagan
గత ఏడాది నవంబర్ 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పతకం వర్తిస్తుందని చెబుతున్నారు. దీంతో తల్లులు అయోమయంలో పడుతున్నారు. తమ బిడ్డలకు హాజరు శాతం ఉందో లేదో అనే సందిగ్దంలో పడిపోతున్నారు. ఇప్పటికే అమ్మఒడి పథకం ప్రక్రియ మొదలైంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అయితేనే అకౌంట్లలో డబ్బులు పడతాయని అధికారులు సూచిస్తున్నారు.