Simhadri Re-release : అక్షరాలా 1.8 లక్షల రూపాయిలు..’సింహాద్రి’ రీ రిలీజ్ కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

ఇండస్ట్రీ ని ఒకప్పుడు షేక్ చేసి ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరో గా నిలబెట్టిన ఒక సినిమాకి రీ రిలీజ్ లో ఇంత తక్కువ వసూళ్లు రావడం ఏంటో అని నందమూరి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

  • Written By: Vicky
  • Published On:
Simhadri Re-release : అక్షరాలా 1.8 లక్షల రూపాయిలు..’సింహాద్రి’ రీ రిలీజ్ కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

Simhadri Re-release: రీ రిలీజ్ ట్రెండ్ చరిత్ర లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్ తో విడుదలైన చిత్రం ‘సింహాద్రి’. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా 1200 షోస్ తో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు దాదాపుగా మూడు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిలిచింది. కానీ ఖుషి మొదటి రోజు వసూళ్లను మాత్రం అందుకోలేకపోయింది.

ఈ చిత్రానికి సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ చూసి, కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజే పది కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని అనుకున్నారు. కానీ అభిమానులు తప్పా ఈ చిత్రాన్ని కామన్ ఆడియన్స్ ప్రోత్సహించలేదు. ఫలితంగానే ఇలా అయ్యిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. గత ఏడాది విడుదలైన ఖుషి చిత్రానికి పది రోజులకు పైగా థియేట్రికల్ రన్ రాగ, సింహాద్రి చిత్రానికి రెండవ రోజు నుండే వసూళ్లు మొత్తం పడిపోయాయి.

ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రచారం చెయ్యబడిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఇంత తక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రెండవ రోజు ఈ చిత్రానికి కేవలం 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఖుషి చిత్రానికి రెండవ రోజు ఏకంగా కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఇక ఆ తర్వాత మూడవ రోజు ఖుషి చిత్రం 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

కానీ సింహాద్రి చిత్రం మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి లక్ష 80 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీ ని ఒకప్పుడు షేక్ చేసి ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరో గా నిలబెట్టిన ఒక సినిమాకి రీ రిలీజ్ లో ఇంత తక్కువ వసూళ్లు రావడం ఏంటో అని నందమూరి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు