American Population : ప్రతీ ఏడుగురిలో ఒకరు పరదేశీ.. అమెరికాలో పరిస్థితి ఇదీ
2022లో అమెరికా జనాభాలో వలసదారుల వాటా 13.9 శాతంగా నమోదైంది. అంటే కేవలం కేవలం 0.7 శాతం పెరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు వలస దారుల సంఖ్య 76% తగ్గింది.

American Population : అగ్రరాజ్యం అమెరికాలో విదేశీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉపాధి, డాలర్ డ్రీమ్‌తో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు అమెరికా బాట పడుతున్నారు. కరోనా తర్వాత అమెరికా వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. భారత దేశం నుంచే నిత్యం 2 వేల మంది అమెరికా విమానం ఎక్కుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కొన్ని రోజులుగా కిటకిటలాడుతోంది. ఇందుకు కారణం.. అమెరికా వెళ్తున్న తమ పిల్లలకు సెండాఫ్ ఇచే‍్చందుకు కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలి వస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా జనాభా గణన బోర్డు ఇటీవలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం అమెరికా జనాభాలో చట్టపరమైన, అక్రమ వలసదారులు 13.9% ఉన్నారు. ఇది మునుపటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది.
33 కోట్లు దాటిన అమెరికా జనాభా..
యూఎస్ సెన్సెస్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు 2022, జూలై నాటికి అమెరికా జనాభా 33 కోట్ల. ఇందులో 13.9% చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన వలసదారులు కూడా ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం వలస జనాభా 13.6 శాతంగా ఉండేది. ఏడాదిలో 0.3 శాతం వలస వాదులు పెరిగారు. మరో మాటలో చెప్పాలంటే, ఏడుగురు అమెరికా నివాసితుల్లో ఒకరు విదేశీయులుగా చెప‍్పవచ్చు. అమెరికా సెన్సెస్ బోర్డు ఈ పదాన్ని నివేదికలో ఉపయోగించడం గమనార్హం.
అమెరికా, చైనా నుంచే 6 శాతం..
2022లో మొత్తం ఇమ్మిగ్రేషన్ కౌంట్‌లో భారత్, చైనా నుంచే 6 శాతం మంది అమెరికాకు వలస వచ్చారు. 2022 జనాభా లెక్కల ప్రకారం భారతీయుల సంఖ్య 28.4 లక్షలు, అంతకుముందు సంవత్సరం 27.09 లక్షల అమెరికా చేరుకున్నారు. వలసల పెరుగుదల 4.8% నమోదైంది. ఇక చైనీస్ వలసదారులు 79 వేల మంది గతేడాది అమెరికా వలస వెళ్లారు. అంతకు ముందు ఏడాదిలో పోలీస్లే పెరుగుదల దాదాపు 3% ఉంది. మెక్సికన్లు 106.8 లక్షల (లేదా వలస జనాభాలో 23%) జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరం గణాంకాలతో పోలిస్తే 1% కంటే తక్కువ తగ్గుదల ఉంది. ఈ మూడు దేశాల నుంచి వచ్చిన వలసదారుల సంఖ్యతో పోల్చితే ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా నుంచి వచ్చిన వారి సంఖ్య వరుసగా 4.07 లక్షలు, 6.7 లక్షలు తక్కువగా ఉంది. అయితే, ఈ రెండు దేశాల నుంచి శరణార్థుల కారణంగా, 2021 డేటా కంటే 2022లో పెరుగుదల 229%, 22%గా నమోదైంది.
దశాబ్దంలో 0,7 శాతం పెరుగుదల..
ఇదిలా ఉండగా గత దశాబ్దంలో (2012-2022) జనాభాలో అమెరికా వలసదారుల వాటా పెరుగుదల ఎన్నడూ లేనంత తక్కువగా ఉంది. 2012లో అమెరికా జనాభాలో వలసదారులు 13.1% ఉన్నారు. 2022లో అమెరికా జనాభాలో వలసదారుల వాటా 13.9 శాతంగా నమోదైంది. అంటే కేవలం కేవలం 0.7 శాతం పెరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు వలస దారుల సంఖ్య 76% తగ్గింది.
