One child is enough: ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దనుకుంటున్నారా? ఆలోచించాల్సిందే?
One child is enough: జనాభా పెరుగుదలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో జనాభా విస్పోటనంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మేమిద్దరం మాకొక్కరు అనే నినాదంతో నేటి యువత ఒక్కరితోనే జనాభాను నియంత్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణకు పటిష్టంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో వచ్చే సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కరితోనే ప్రేమానురాగాలు పెరుగుతాయని ఆలోచిస్తున్నారు. దీని కోసమే కనీసం ఇద్దరిని కూడా కనడానికి వెనకాడుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా […]

One child is enough: జనాభా పెరుగుదలతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో జనాభా విస్పోటనంతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మేమిద్దరం మాకొక్కరు అనే నినాదంతో నేటి యువత ఒక్కరితోనే జనాభాను నియంత్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణకు పటిష్టంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో వచ్చే సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కరితోనే ప్రేమానురాగాలు పెరుగుతాయని ఆలోచిస్తున్నారు. దీని కోసమే కనీసం ఇద్దరిని కూడా కనడానికి వెనకాడుతున్నారు.

One child is enough
దీనివల్ల అనేక సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉండే పిల్లల్లో అనేక మానసిక రుగ్మతలు వస్తాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇద్దరుంటే ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఆలోచించే సూచనలుంటాయి. దీంతో దంపతులు ఒక్కరితో ఆపకుండా ఇద్దరిని కనేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది.
తోబుట్టువులు ఉంటేనే అల్లరి చేష్టలతో పాటు అనురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలనే దానిపై వీరికి అవగాహన ఎక్కువవుతుంది. ఒంటరిగా పెరిగే వాళ్లలో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. ఒంటరిగా పెరిగే వారిలో ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడతాయని తెలుస్తోంది.
Also Read: Painless death in one minute: నిముషంలో నొప్పి తెలియకుండా చంపేసే మెషిన్.. దీని గురించి తెలిస్తే..
వ్యక్తిత్వ వికాసానికి ఒంటరి తనం శాపమే కానుంది. ఇద్దరుంటేనే వారిలో అన్ని విషయాల్లో తయారవుతారు. ఒక్కరైతే వ్యక్తిత్వ లోపాలు ఎక్కువవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. తోబుట్టువులు లేని చిన్నారుల్లో నలుగురిలో ఇమడలేకపోవడం వంటి విషయాల్లో ఆందోళన నెలకొంటుంది. దీంతో దంపతులు ఒక్కరే ముద్దు అనే బదులు ఇద్దరు పిల్లలతోనే సంతోషం ఉంటుందని తెలుసుకుని ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం అని గుర్తుంచుకోవాలి.
Also Read: Crashing Army Helicopter: కూప్పకూలిన ఆర్మీ పెద్ద హెలికాప్టర్.. కాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన?
