Gold Prices: మరోసారి దిగువకు బంగారం, వెండి ధరలు.. అసలు ఎందుకు తగ్గుతున్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,680గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,530 పలుకుతోంది.

Gold Prices: బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూసే. రెండింటి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. బుధవారం కంటే గురువారం బంగారం రూ.300 తగ్గగా.. వెండి రూ.1200 దిగువన నమోదైంది. 2023 నవంబర్ 2 గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 2న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,530 గా ఉంది. నవంబర్ 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,700తో విక్రయించారు. బుధవారం కంటే గురువారం బంగారం ధరలు రూ.300 తగ్గింది. బుధవారంతో పాటు గురువారం వరుసగా రెండు రోజుల పాటు రూ.800 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,680గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,530 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,860 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,030తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,530తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,530తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,100గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం వెండి ధరలు రూ.1200 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,100గా ఉంది. ముంబైలో రూ.74,100, చెన్నైలో రూ.77,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.77,000తో విక్రయిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 0.6 పడిపోయి 1994.30 డాలర్ల వద్ద నమోదైంది. మల్టీ కమొడిటీ ఎక్చేంజీలో 10 గ్రామలు బంగారం రూ.60, 764 నమోదైంది. ఫెడ్ ధరలు నిర్ణయంలో ఒడిదొడుకులు సాగుతున్నాయి. దీంతో బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని అంటున్నారు.
