OM Re Release: 550 సార్లు రీ రిలీజ్..100 కోట్లకి పైగా గ్రాస్ ని సాధించిన ఏకైక ఇండియన్ సినిమా అదే!
ఏకంగా 550 సార్లు విడుదలైంది. విడుదలైన ప్రతీ సారీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. టికెట్స్ దొరకక బ్లాక్ లో కూడా నడిచిన రోజులు ఉన్నాయి. ఆ చిత్రం మన తెలుగు సినిమాకి సంబంధించినది కాదు.

OM Re Release: ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. తెలుగు లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ని చూసి ఇప్పుడు తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోల కెరీర్ లో మైలు రాళ్లుగా నిల్చిపోయిన కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు డబ్బులు పోగేసుకుంటున్నారు. మన టాలీవుడ్ లో కూడా రీసెంట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి, వాటిల్లో కేవలం కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అయితే ఒక సినిమా
ఏకంగా 550 సార్లు విడుదలైంది. విడుదలైన ప్రతీ సారీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. టికెట్స్ దొరకక బ్లాక్ లో కూడా నడిచిన రోజులు ఉన్నాయి. ఆ చిత్రం మన తెలుగు సినిమాకి సంబంధించినది కాదు, కన్నడ చిత్ర పరిశ్రమకి సంబంధించిన చిత్రం. ఆ సినిమా పేరు ‘ఓం’.ఉపేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరో గా నటించాడు.
అప్పట్లో ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపేసింది, ఉపేంద్ర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కోసం ఆయన నిజమైన అండర్ వరల్డ్ డాన్స్ ని జైలు నుండి బైలు మీద బయటకి తీసుకొచ్చి ఈ చిత్రం లో నటింపచేసాడు. వీళ్ళతో పాటుగా లోకల్ రౌడీ షీటర్స్ కూడా ఈ చిత్రం లో ఎంతో మంది ఉన్నారు.అలా ఇండియాలో ఏ డైరెక్టర్ చెయ్యని విధంగా ఉపేంద్ర సరికొత్త ప్రయోగం చేసి సంచలనం సృష్టించాడు.మొదటి సారి విడుదలైనప్పుడు పది కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ చిత్రం,రెండవ సారి రీ రిలీజ్ అయ్యినప్పుడు 12 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.
అలా సుమారుగా 550 సార్లు రీ రిలీజ్ అయిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ సినిమాకి కూడా ఇలా జరగలేదు.ఈ చిత్రానికే మొట్టమొదట జరిగింది, ఈ చిత్రం తోనే అది ముగిసిపోయింది. ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాని అప్పట్లో ఉపేంద్ర తెలుగులో హీరో రాజశేఖర్ ని పెట్టి రీమేక్ చేసాడు. ఇక్కడ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.