Tollywood:ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? రీసెంట్ గా వచ్చిన సినిమాలో నటించాడు..

కొందరు సినీ స్టార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తారు. అలా తారల బంధుగణం టాలీవుడ్ సినిమాలో ఎక్కువే ఉంది. అలనాటి ఎన్టీఆర్, ఎన్నార్ ల నుంచి బంధువులు సినిమాల్లోకి రావడం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్నవారిలో అత్యధికంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆయన అల్లుడు కళ్యాణ్ తేజ్ వరకు అందరూ సినీ ఫీల్డులోనే ఉన్నారు. ఇక నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Tollywood:ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..? రీసెంట్ గా వచ్చిన సినిమాలో నటించాడు..

కొందరు సినీ స్టార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తారు. అలా తారల బంధుగణం టాలీవుడ్ సినిమాలో ఎక్కువే ఉంది. అలనాటి ఎన్టీఆర్, ఎన్నార్ ల నుంచి బంధువులు సినిమాల్లోకి రావడం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్నవారిలో అత్యధికంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆయన అల్లుడు కళ్యాణ్ తేజ్ వరకు అందరూ సినీ ఫీల్డులోనే ఉన్నారు. ఇక నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అవుతుండగా.. కొందరు సాదాసీదా హీరోగా సినిమాలు తీస్తున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ హీరో చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పై ఫొటో చూశారా..? స్మార్ట్ బాయ్ లా కళ్లద్దాలు పెట్టుకున్న ఈ యువకుడు ఇప్పుడు మెగా హీరో అన్న విషయం తెలుసా..? అయితే చదవండి. ఆయనెవరో కాదు. మొదటి సినిమా ‘ఉప్పెన’తో బంపర్ హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో సినీ హీరోగా మారాడు. ఈయన ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ఓ రోల్ లో కనిపిస్తాడు. అయితే అప్పుడు ఎవరూ గుర్తుపట్టరు లేండి..

Also Read: Gangavva: గంగవ్వ ఓ ఇంటిదైంది.. సెలబ్రెటీల సందడి

ఇక వైష్ణవ్ తేజ్ రీసెంట్ గా కొండపొలం సినిమాలో నటించాడు.ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. కలెక్షన్ల విషయం పక్కనబెడితే అన్ని వర్గాల్లో వైష్ణవ్ తేజ్ నటనను మెచ్చుకుంటున్నారు. దీంతో ఈ స్టార్ హీరో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి ఇటీవలే కోలుకున్నాడు. దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఓ ఫొటోను చిరు సోషల్ మీడియాలో పెట్టాడు.

నిత్యం ప్రతీ అకేషన్ కు కలుస్తున్న మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కల్యాన్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే అల్లు శిరీష్ మాత్రం కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ బాయ్ ఉన్న వైష్ణవ్ మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్లో ఆ ఫొటో దిగాడట. ఆ ఫొటో మెగా ఫ్యాన్స్ కు దొరకడంతో దానిని వైరల్ చేసేస్తున్నారు.

Also Read: Samantha: సమంత సాయంతో ఆ హీరోయన్​ ప్రాణాలు సేఫ్​!

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు