Thaman OG BGM: ఓజీ బీజీఎమ్ కాపీనా అడ్డంగా దొరికిపోయాడు? క్యాజీ తమన్ జీ!
దర్శకుడు సుజిత్ మేకింగ్ కి పవన్ కళ్యాణ్ తోడు కావడంతో టీజర్ మరో స్థాయికి చేరుకుంది. వాటికి అదనంగా తమన్ బీజీఎమ్ యాడ్ కావటంతో టీజర్ మోత మోగింది.

Thaman OG BGM: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే పేరు తమన్. అల వైకుంఠపురం లో సినిమా ఆల్బమ్ ద్వారా ఊహించని స్టార్ స్టేటస్ అందుకున్నాడు తమన్. అదే వరుసలో అఖండ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పవర్ ఫుల్ , మాస్ సినిమాలకు తమన్ బీజీఎమ్ ఉండాల్సిందే అనే స్థాయికి వెళ్ళాడు.
అయితే తమన్ దగ్గర వచ్చిన సమస్య ఏమిటంటే తాను ఏ మ్యూజిక్ ఇచ్చిన దాని తాలూకా రిఫరెన్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. దీనితో తమన్ కు కాపీ క్యాట్ అనే పేరు వచ్చింది. తమన్ నుండి ఒక సాంగ్ కానీ, ఒక BGM కానీ వచ్చిన వెంటనే దానిని ఎక్కడ నుండి కాపీ కొట్టాడు అనే ఆరాలు మొదలవుతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG ఫస్ట్ టీజర్ విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది.
దర్శకుడు సుజిత్ మేకింగ్ కి పవన్ కళ్యాణ్ తోడు కావడంతో టీజర్ మరో స్థాయికి చేరుకుంది. వాటికి అదనంగా తమన్ బీజీఎమ్ యాడ్ కావటంతో టీజర్ మోత మోగింది. పవన్ ఎలివేషన్ టైం లో తమన్ ఇచ్చిన బీజీఎమ్ అయితే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. ఇదే సమయంలో అసలు ఇలాంటి బీజీఎమ్ తమన్ ఎక్కడ నుండి లేపాడు అనే పరిశోధనలు మొదలయ్యాయి.
స్ప్లేషెర్ ఫిల్మ్స్ అనే సంస్థ రిలీజ్ చేసిన వాటి నుండి తమన్ OG టీజర్ బీజీఎమ్ లేపేసినట్లు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో మరోసారి తమన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు ట్రోలర్స్. ఇలా జరగడం తమన్ కి ఏమి కొత్త అయితే కాదులే. ప్రతి సినిమా కు ఇలాంటివి అలవాటు అయిపోయాయి తనకు. ప్రస్తుతం తమన్ ఉన్న ఫామ్ కి ఇదేమి పెద్ద సమస్య కాదు. ట్యూన్ ఎక్కడ నుండి లేపేసిన కానీ ఫైనల్ గా అవుట్ ఫుట్ ఎలా వస్తుందనేదే చూస్తారు సినీ జనాలు.
https://twitter.com/evvpunchlu333/status/1698332326349230139?s=20
