OG Glimpse Recard : ఆల్ టైం రికార్డు సృష్టించిన ఓజీ గ్లింప్స్.. 24 గంటల్లో సునామీ!
ఓజీ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. దర్శకుడు సుజీత్ భారీగా రూపొందిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్ర నిర్మాత. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది.

OG Glimpse Recard : ఈసారి పవన్ కళ్యాణ్ జన్మదినం అభిమానులకు చాలా ప్రత్యేకం. ఏకంగా నాలుగు అప్డేట్స్ తో వారి దాహం తీరింది. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుండి స్పెషల్ పోస్టర్స్ వచ్చాయి. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ ప్రకటించారు. వీటన్నింటికీ మించి కిక్ ఇచ్చింది ఓజీ టీజర్. దాదాపు నిమిషానికి పైగా ఉన్న గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించింది. నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ సాగిన ఓజీ ప్రోమో ఎక్కడా తగ్గలేదు. షార్ప్ కట్స్ తో పరుగులు పెట్టింది.
ఇక పవన్ కళ్యాణ్ ఊచకోత, స్టైలింగ్, మేనరిజం హైలెట్ గా నిలిచాయి. గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్ మరపురాని అనుభూతి పంచింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లో స్పెషల్ మూవీ అవుతుందని టీజర్ చెప్పకనే చెబుతుంది. అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికులను ఓజీ టీజర్ మెప్పించిన నేపథ్యంలో అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో ఓజీ గ్లిమ్ప్స్ అనేక రికార్డ్స్ నెలకొల్పింది.
లైక్స్ లో ఓజీ ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. 24 గంటల్లో ఏకంగా 7.30 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో మరే చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ఈ స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం భీమ్లా నాయక్ పేరిట ఉన్న రికార్డుని ఆయనే బ్రేక్ చేశారు. భీమ్లా నాయక్ గ్లింప్స్ 7.28 లక్షల లైక్స్ తో రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ లక్షల లైక్స్ రికార్డు కూడా ఓజీ ఖాతాలో పడింది. కేవలం 7 నిమిషాల్లో ఓజీ గ్లింప్స్ లక్షల లైక్స్ అందుకుంది. ఇక 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఓజీ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. దర్శకుడు సుజీత్ భారీగా రూపొందిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్ర నిర్మాత. పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఓజీ టీజర్లో థమన్ బీజీఎం మరో హైలెట్ అని చెప్పాలి. ఓజీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే సూచనలు కలవు.
