Odisha train tragedy : రైలు ప్రమాదంపై విమర్శలు.. ఎంత వరకూ కరెక్ట్?
చనిపోయిన వ్యక్తులు ఎవరు? వారి కుటుంబాలు ఏమిటీ? వారికి ఏలాంటి సహాయ సహకారాలు అందించగలమా? అన్నది మనం ఆలోచించాల్సింది పోయి ఇలా కుట్రలు, కుతంత్రాలు అంటూ విమర్శలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.

Odisha train tragedy : రైలు ప్రమాద వార్త అత్యంత బాధకరమైనది. 300 మందికి పైగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించడాన్ని ప్రజలంతా తట్టుకోలేకపోతున్నారు. ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. దాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టంగా మారింది.
ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు ప్రయాణికులు దాదాపు 300 వరకు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారు వందల్లో ఉన్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కొడుకు ఆచూకి కోసం శవాల మధ్య వెతుకుతూ కన్నీటిపర్యంతమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే తన కొడుకు ప్రయాణించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు తన కొడుకు ఆచూకీ దొరకలేదని, తన కొడుకు బతికే ఉన్నాడని దుఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు.
రైలు ప్రమాదంపై సోషల్ మీడియా, టీవీల్లో రాజకీయ పార్టీలు, మేధావులు చర్చల మీద చర్చలు జరిపారు. రైల్వే అథారిటీకే మొత్తం ప్రమాదానికి కారణం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ప్రతిపక్షాలు దీన్నిప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకొచ్చారు. రైల్వేలో ఉండే సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. రైలు ప్రమాదానికి కారణాలు తెల్లవారే ఎలా తెలుస్తాయన్నది ప్రశ్న. ఇది విదేశీ కుట్ర అని కొందరు.. కుట్రకోణం అని మరికొందరు విమర్శలు చేశారు.
చనిపోయిన వ్యక్తులు ఎవరు? వారి కుటుంబాలు ఏమిటీ? వారికి ఏలాంటి సహాయ సహకారాలు అందించగలమా? అన్నది మనం ఆలోచించాల్సింది పోయి ఇలా కుట్రలు, కుతంత్రాలు అంటూ విమర్శలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
ప్రమాద ఘటన అత్యంత బాధాకరం, ప్రతిపక్షాల వ్యాఖ్యలు అంతకన్నా దారుణం. ఈ విషయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
