Odisha Train Tragedy: మృత్యు పట్టాలపై నలిగిపోయిన ‘ప్రేమ’
భారీ రైలు ప్రమాదంలో ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

Odisha Train Tragedy: ప్రేమ.. ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎల్లాలు దాటినా.. ఖండంతరాలు అవతల ఉన్నా మనసులను దగ్గర చేర్చే ఒక దివ్య ఔషధం. అందుకే ప్రేమను ఎలాగైనా వర్ణించవచ్చు. ప్రేమించిన మనిషికి దూరమైనా.. దగ్గరగా చేరుకునే క్రమంలో..ప్రేమికుల భావోద్వేగం మనసు లోతుల్లో నుంచి వస్తుంది. ఒడిశా రైలు ప్రమాదంలో అటువంటి భగ్న ప్రేమికుడి భావోద్వేగం ఒకటి కాగితాల రూపంలో బయటపడింది. దేశంలోనే అత్యంత భారీ రైలు ప్రమాదం ఒడిశాలో జరిగింది. 277 మంది మృత్యువాత పడగా.. మరో 1000 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దేశం యావత్ ఈ ఘటనతో కలవరపాటకు గురైంది.
ఈ భారీ రైలు ప్రమాదంలో ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రేమను వ్యక్తం చేసే సింబల్స్ కనిపించాయి. ఎవరో ప్రయాణికుడు తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ డైరీలోని వ్యక్తిని గురించి ఇంత వరకూ ఎలాంటి సమాచారం దొరకలేదు. కానీ లవ్ లెటర్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నేను నిన్ను ప్రతీ నిమిషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు అని రాసి ఉంది. లవ్ తో పాటు చిన్నచిన్న క్యూట్ సింబల్స్ తో ఆకట్టుకునే విధంగా రాతలు ఉన్నాయి. ప్రేమికురాలిని దూరమైనందుకో.. లేకుంటే మరికొద్దిసేపట్లో దగ్గరవుతున్నానన్న ఆనందమో తెలియదు కానీ.. భావోద్వేగంతో రాసినట్టు కనిపిస్తోంది. ప్రేమకు సంబంధించిన కాగితాలను జాగ్రత్త పరుస్తామని పోలీసుల అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవేనంటూ ఎవరూ ముందు రాలేదని చెప్పారు. కానీ ఆ భగ్న ప్రేమికుడు క్షేమంగా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు. కామెంట్లు పెడుతున్నారు.
