SA vs NZ: టాస్ గెలిచి పెద్ద తప్పు చేసిన న్యూజిలాండ్.. అదే సౌతాఫ్రికాకు విజయం

వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ మీద సౌతాఫ్రికా టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ టోర్నీ మొత్తం లో ఈ రెండు టీములు కూడా బలమైన టీములుగా మొదటి నుంచి మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ రెండు టీమ్ ల మధ్య మ్యాచ్ అంటే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది […]

  • Written By: NARESH
  • Published On:
SA vs NZ: టాస్ గెలిచి పెద్ద తప్పు చేసిన న్యూజిలాండ్.. అదే సౌతాఫ్రికాకు విజయం

వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ మీద సౌతాఫ్రికా టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ టోర్నీ మొత్తం లో ఈ రెండు టీములు కూడా బలమైన టీములుగా మొదటి నుంచి మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ రెండు టీమ్ ల మధ్య మ్యాచ్ అంటే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది అని అందరూ భావించారు.కానీ ఈ మ్యాచ్ ని సౌతాఫ్రికా వన్ సైడ్ చేసేసింది.ఇక మ్యాచ్ కి ముందు మాత్రం ఈ మ్యాచ్ మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రెండింటిలో ఏ టీమ్ విజయం సాధిస్తుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది కానీ అందరికీ షాక్ ఇస్తూ సౌత్ ఆఫ్రికా టీమ్ విజయాన్ని అందుకోవడం ఈ టైం లో ఆ టీమ్ కి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి.

అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీం ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు ఇలా ఓడిపోవడం జరిగింది అనే దాని మీదనే చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి మొదటి కారణం ఏంటి అంటే న్యూజిలాండ్ టాస్ గెలిచి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ ఇవ్వడం న్యూజిలాండ్ చేసిన అతి పెద్ద తప్పు…ఎందుకంటే సౌతాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేస్తుంది. కానీ చేజింగ్ లో మాత్రం వాళ్లు ఒక భారీ స్కోరు ని చేజ్ చేయలేరు. ఇప్పటివరకు వాళ్లు వరల్డ్ కప్ లో 300 ప్లస్ స్కోరు ఉన్న ఒక మ్యాచ్ ని కూడా చేజ్ చేయలేకపోయారు. కాబట్టి న్యూజిలాండ్ టాస్ గెలిచినప్పుడు మొదటి బ్యాటింగ్ తీసుకొని ఒక భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా టీం ముందు ఉంచితే సౌతాఫ్రికా దాన్ని చేజ్ చేయలేక చతికిల పడేది.అయితే సౌతాఫ్రికా చేజింగ్ లో భారీ స్కోర్ ని ఎందుకు చేజ్ చేయలేదు అంటే వాళ్ళ ప్లేయర్లు ప్రెజర్ ని కంట్రోల్ చేసుకొని ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడెంత కెపాసిటీ ప్రస్తుతం ఉన్న సౌతాఫ్రికా టీం ప్లేయర్ లో లేదు అందువల్ల సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 95% సౌతాఫ్రికా మ్యాచ్ ఓడిపోతుందనే చెప్పాలి.

ఇక సెమీస్ కి వెళ్లాల్సిన ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ సౌతాఫ్రికా కి మొదట బ్యాటింగ్ ఇచ్చి పెద్ద తప్పు చేసింది ఇక దానికి భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో డికాక్ మరోసారి సెంచరీ చేసి తను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అలాగే ఈ టోర్నీ లో ఇప్పటి వరకు మొత్తం 4 సెంచరీ లను నమోదు చేశాడు. అలాగే వండర్ డాసెన్ కూడా అద్భుతమైన సెంచరీ చేసి తనదైన రీతిలో సౌతాఫ్రికా టీం కి ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడి భారీ.స్కోర్ ని అయితే సాధించగలిగాడు.ఇక చివర్ లో మిల్లర్ కూడా హాఫ్ సెంచరీ చేసి టీం భారీ స్కోరు చేయడానికి తన వంతు సహాయం అయితే చేశాడు.

ఇక నిర్ణీత 50 ఓవర్లకి సౌతాఫ్రికా టీమ్ 357 పరుగులు చేసింది.ఇక 358 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ప్లేయర్లు సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో చాలావరకు తడబడ్డారు.ఇక ఈ క్రమంలో 167 పరుగులకి న్యూజిలాండ్ టీమ్.ఆలౌట్ అయింది. ఇక ఈ క్రమం లో 190 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయాన్ని అందుకుంది…దీంతో సౌతాఫ్రికా టీం పాయింట్స్ టేబుల్ లో 6 విజయాలను అందుకొని నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళింది. ఇండియా నెంబర్ 2 పొజిషన్ లో ఉండగా,ఈ ఓటమితో న్యూజిలాండ్ టీమ్ నెంబర్ త్రీ పొజిషన్ నుంచి నెంబర్ 4 పోజీషన్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం నెంబర్ త్రీ పొజిషన్ లో ఆస్ట్రేలియా కొనసాగుతుంది ఇదే క్రమంలో న్యూజిలాండ్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడితే అందులో నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

మొదటి నుంచి కూడా మంచి విజయాలను అందుకుంటున్న న్యూజిలాండ్ టీమ్ ఇప్పుడు మాత్రం కొంతవరకు తడబడుతుంది.ఎందుకంటే స్టార్ ప్లేయర్లు అందులో ఉన్నప్పటికీ మ్యాచ్ విజయాలను మాత్రం అందుకోవడంలో చాలా వరకు తడబడుతున్నారు.ఇక సెమీస్ కి వెళ్ళే టైం లో ప్రతి టీం కూడా కీలకమైన మ్యాచ్ లు ఆడుతుంటే న్యూజిలాండ్ మాత్రం వరుసగా ఓడిపోవడం వల్ల ఆ టీమ్ కి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందనే చెప్పాలి .ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ 4 వికెట్లు తీయగా, మాక్రో జాన్సన్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ ని భారీ దెబ్బ కొట్టారు…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు