Site icon OkTelugu

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts

Cockroach Facts

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే ప్రతి సృష్టి చేసే జంతువు. ఎలాగైనా బతుకుతుంది. ఎటువంటి కఠిన పరిస్థితిలోనైనా సరే జీవిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ జీవి ఏంటి .. ఎక్కడ ఉంటుంది.. ఏం తింటుంది.. ఎలా పెరుగుతుంది.. చదివేద్దాం పదండి ఈ కథనంలో..

ఒక జీవి మనుగడ అనుకూల పరిస్థితిలో చాలా బాగుంటుంది. అదే ప్రతికూల పరిస్థితులలో అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతకడం బొద్దింకకు చాలా ఇష్టం. పైగా ఇబ్బందికరమైన పరిస్థితులను తట్టుకుంటూ అది మరగడ సాగిస్తూ ఉంటుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు.. భారీగా రేడియో ధార్మికత ఉన్నప్పటికీ అంత అటుకుంటుంది. తల తెగిపడినప్పటికీ వారం వరకు అది జీవిస్తూనే ఉంటుంది.

మనుషులకు సంబంధించి రక్తప్రసరణ వ్యవస్థ.. శ్వాస వ్యవస్థ.. ఇవన్నీ కూడా మెదడు మీద ఆధారపడి ఉంటాయి. కానీ బొద్దింకల విషయంలో నాడీ వ్యవస్థ గాంగ్లియా మీద ఆధారపడి ఉంటుంది. ఇది శరీరం మొత్తం విస్తరించి ఉంటుంది. దీనివల్ల మెదడు నుంచి సంకేతాలు రాకపోయినప్పటికీ.. దాని శరీరంలో కదలికలు జరుగుతూనే ఉంటాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. బొద్దింకలో రక్తప్రసరణ వ్యవస్థ మిగతా వాటితో పోల్చి చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. దీని రక్తాన్ని సాంకేతిక పరిభాషలో హీమోలింపు అని పిలుస్తుంటారు. ఇది పీడనంతో కూడి ఉంటుంది. అందువల్లే రక్త నాళాల నెట్వర్క్ మీదుగా ప్రవహించలేదు.

ఒకవేళ తల తెగిపడినప్పటికీ రక్తస్రావం జరగదు. పైగా ఆ ప్రాంతం సహజ సిద్ధంగానే పూడుకొని పోతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి బొద్దింక కు నోరు లేదా ముక్కు పెద్దగా అవసరం ఉండదు. దీని శరీరం మీద స్పిరకిల్స్ అనే చిన్న చిన్న రంద్రాలు ఉంటాయి. వాటి ద్వారానే శ్వాస తీసుకుంటూ ఉంటుంది. ఆక్సిజన్ డైరెక్ట్ గా శరీరంలో ఉన్న భాగాలకు అందుతూ ఉంటుంది. ఇన్ని రకాల సానుకూలతలు ఉన్నాయి కాబట్టి బొద్దింక తల లేకపోయినప్పటికీ కొద్దిరోజులు మాత్రమే బతకగలుగుతుంది. కాకపోతే సమయానికి నీళ్లు లభించకపోతే ఇంకా డిహైడ్రేషన్ వల్ల కన్నుమూస్తుంది. తల తెగిపడితే ఈ భూమి మీద చాలా జంతువులు చనిపోతాయి. కానీ బొద్దింక మాత్రమే బతకగలుగుతుంది.

Exit mobile version