Coconut Juice: ఎండాకాలం లో మనకు విరివిగా పండ్లు లభిస్తాయి. ఇందులో కొబ్బరి బోండాలు ముందు వరుసలో ఉంటాయి. కొబ్బరి బోండాలు అంత ఎత్తున ఉండే కొబ్బరి చెట్టుకు ఉంటాయి. కొబ్బరి బోండాలను చెట్టు నుంచి తెంపడం ఒక కళ. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలో కొబ్బరి అనేది అత్యంత విలువైన పరిశ్రమ.
వేలాది ఎకరాలలో విస్తరించిన కొబ్బరి తోటలు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంటాయి. ముఖ్యంగా కొబ్బరి బోండాల వ్యాపారం వేసవికాలంలో ఉభయగోదావరి జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉంటుంది. రావులపాలెం కేంద్రంగా పచ్చి కొబ్బరికాయల వ్యాపారం సాగుతూ ఉంటుంది.. పచ్చి కొబ్బరికాయల నీళ్లను ఎండాకాలంలో తాగడం చాలామందికి ఇష్టం. నీళ్లు తాగిన తర్వాత.. అందులో ఉన్న లేత కొబ్బరిని తినడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు.
కొబ్బరి నీళ్లలో అనేక రకాలైన ప్రోటీన్లు.. విటమిన్లు..ఉంటాయి. ఈ శరీరానికి చలవచేస్తాయి. వీటివల్ల ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అయితే ఉభయగోదావరి జిల్లాలో కొబ్బరితో అనేక రకాలైన ప్రయోగాలు చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కొబ్బరి జ్యూస్. వాస్తవానికి కొబ్బరి జ్యూస్ అనేది ఇక్కడ మాత్రమే తయారు చేస్తారు. దీనికోసం రాజమండ్రిలో ఒక దుకాణమే ఏర్పాటయింది.
ముందుగా కొబ్బరి బోండాలను కొడతారు. అందులో నీటిని పడతారు. ఆ తర్వాత బోండాలలో ఉన్న లేత కొబ్బరిని బయటకు తీస్తారు. దానికి ఓఆర్ఎస్ పౌడర్ కలుపుతారు. పచ్చికొబ్బరి.. ఓఆర్ఎస్ పౌడర్.. కొబ్బరి నీళ్లను మిక్సీ పడతారు. ఆ తర్వాత ఆ జ్యూస్ గ్లాసులో పోసి.. దానిపైన జీడిపప్పులు, బాదం పప్పులు వేసి మ్యారినేట్ చేస్తారు. ఆ గ్లాసును మన చేతికి ఇస్తారు. ఇందులో ఐస్ ఉండదు.. ఎటువంటి ఆర్టిఫిషియల్ పదార్థాలు ఉండవు. ఒకవేళ గ్లూకోస్ పౌడర్ వద్దనుకుంటే వెయ్యరు. ఈ డ్రింక్ ఎండాకాలంలో ఎనర్జీ పెంచుతుందని .. బాడీలో ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లకుండా కాపాడుతుందని స్థానికులు చెబుతున్నారు.