Site icon OkTelugu

Lion Afraid Of Animals: అడవికి రాజైనా.. సింహానికి ఈ జంతువులంటే భయం..

Lion Afraid Of Animals

Lion Afraid Of Animals

Lion Afraid Of Animals: అడవికి రాజుగా పేరుగాంచిన సింహం ఎంతో బలమైన జంతువు. కానీ ప్రకృతిలో కొన్ని జంతువులు పరిస్థితులను బట్టి సింహాన్ని కూడా చంపగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి తమ బలం, వేగం, విషం లేదా గుంపుగా దాడి చేసే స్వభావంతో సింహానికి పెద్ద ప్రమాదంగా మారుతాయి. ఇప్పుడు అలాంటి జంతువులు ఏవి? అవి ఎక్కడ ఉంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

ఏనుగు (African Elephant):
ఏనుగు భూమిపై అతిపెద్ద భూజంతువు. ఒక పెద్ద ఏనుగు బరువు 5 నుంచి 6 టన్నుల వరకు ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ ఏనుగులు కోపంగా మారితే సింహాలపై దాడి చేస్తాయి. తమ పిల్లలను రక్షించేందుకు ఏనుగులు గుంపుగా సింహాలను తరిమేస్తాయి. కొన్ని సందర్భాల్లో కాళ్లతో తొక్కి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఆఫ్రికా అడవులు, సవానా ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఖడ్గమృగం(Rhinoceros):
ఖడ్గమృగం చాలా దూకుడు స్వభావం కలిగిన జంతువు. దీని ముక్కుపై ఉండే కొమ్ము అత్యంత ప్రమాదకరం. సింహం దాడి చేసినా ఖడ్గమృగం ఒక్కసారిగా ఎదురుదాడి చేస్తే సింహం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధానంగా ఆఫ్రికా, భారతదేశంలోని కొన్ని అడవుల్లో ఉంటాయి.

హిప్పోపోటమస్(Hippopotamus):
హిప్పో నీటిలో ఉండే అత్యంత ప్రమాదకర జంతువుల్లో ఒకటి. దీని దవడ బలం చాలా ఎక్కువ. సింహం నీటి దగ్గర వేటకు వచ్చినప్పుడు హిప్పో దాడి చేస్తే తప్పించుకోవడం కష్టం. ఒక్క కాటు వల్లే భారీ గాయాలు అవుతాయి. ఇవి ఆఫ్రికాలోని నదులు, చెరువుల్లో నివసిస్తాయి.

మొసలి( Nile Crocodile):
నైల్ మొసలి నీటిలో అత్యంత శక్తివంతంగా పోరాడతుంది. నీళ్లు తాగేందుకు వచ్చిన సింహాలపై ఒక్కసారిగా దాడి చేస్తుంది. నీటిలోకి లాగి ముంచి చంపే సామర్థ్యం దీనికి ఉంది. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా నదుల్లో కనిపిస్తాయి.

అడవి ఎద్దు (కేప్ బఫెలో) (African Buffalo):
ఆఫ్రికన్ బఫెలోను ‘బ్లాక్ డెత్ ’ అని కూడా పిలుస్తారు. గుంపుగా తిరిగే ఈ జంతువులు సింహాలపై తీవ్రంగా ఎదురుదాడి చేస్తాయి. కొమ్ములతో పొడిచి సింహాలను చంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఆఫ్రికా గడ్డి భూముల్లో ఎక్కువగా ఉంటాయి.

హైనా గుంపులు (Spotted Hyena):
ఒక హైనా సింహాన్ని చంపడం అరుదు. కానీ పెద్ద గుంపుగా ఉంటే సింహంపై దాడి చేసి చంపగలవు. ముఖ్యంగా బలహీనమైన లేదా గాయపడిన సింహాలను టార్గెట్ చేస్తాయి. ఇవి ఆఫ్రికా అడవులు, గడ్డి మైదానాల్లో కనిపిస్తాయి.

Exit mobile version